Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురూ లేని 'ఎర్రమట్టి కోట' తుది సమరం.. 20 ఏళ్లలో తొలిసారి

14 గ్రాండ్ స్లామ్ లు.. 20 ఏళ్ల కిందట పీట్ సంప్రాస్ సాధించిన ఈ రికార్డును చెరిపేస్తారని ఎవరూ అనుకోలేదు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 5:30 PM GMT
ఆ ముగ్గురూ లేని ఎర్రమట్టి కోట తుది సమరం.. 20 ఏళ్లలో తొలిసారి
X

సమకాలీన టెన్నిస్ ప్రపంచంలో దిగ్గజాలు అంటే ఆ ముగ్గురే.. 21 ఏళ్లలో 84 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లు జరిగితే.. 66 టైటిల్స్ ఈ ముగ్గరివే.. దీన్నిబట్టే వారి సత్తా ఏమిటో తెలుస్తోంది. అలాంటి ఆ త్రయం లేకుండా 20 ఏళ్లలో తొలిసారిగా ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్ జరుగుతోంది. ఎర్ర మట్టి కోర్టుగా ప్రసిద్ధి చెందిన ఆ టోర్నీలో ఇదో అరుదైన సందర్భం అనడంలో సందేహం లేదు.


జకో తప్పుకొన్నాడు..

14 గ్రాండ్ స్లామ్ లు.. 20 ఏళ్ల కిందట పీట్ సంప్రాస్ సాధించిన ఈ రికార్డును చెరిపేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ, రోజర్‌ ఫెదరర్‌ 20 గ్రాండ్ స్లామ్ లు సాధించాడు. ఇదే గొప్ప అనుకుంటే.. 22 టైటిల్స్ కొట్టాడు రఫెల్ నాదల్. చెరిగిపోని రికార్డు నాదల్ సొంతం అంటే..


నొవాక్ జకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్ లు నెగ్గి శిఖరంపై కూర్చున్నాడు. అయితే, 2004 తర్వాత ఈ ముగ్గురిలో ఒక్కరు కూడా లేకుండా ఫ్రెంచ్ ఓపెన్‌ ఫైనల్‌ జరగబోతోంది. గత ఏడాది ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కు వీడ్కోలు పలికాడు. అయితే, నాదల్


తొలి రౌండ్‌ లోనే ఓడాడు. జకోవిచ్ మోకాలి గాయంతో క్వార్టర్‌ ఫైనల్స్‌ కు ముందే వైదొలిగాడు. 2009లో ఫెదరర్ ఒక్కడే ఫైనల్‌ కు చేరుకుని విజేతగా నిలిచాడు. అతడి కెరీర్ లో ఇదే తొలి, చివరి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్.


వీరిద్దరిలో ఎవరిదో టైటిల్?

ఫ్రెంచ్ ఓపెన్ తొలి సెమీస్‌ లో ఇటలీ ఆటగాడు జినిక్ సినర్‌ పై స్పెయిన్‌ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్‌ 2-6, 6-3, 3-6, 6-4, 6-3 తేడాతో గెలిచాడు. రెండో సెమీస్‌ లో నార్వే స్టార్ రూడ్‌పై జర్మనీ సంచలనం అలెగ్జాండర్ జ్వెరెవ్‌ 2-6, 6-2, 6-4, 6-2 తేడాతో నెగ్గాడు. గతేడాది సెమీస్‌ చేరిన అల్కరాజ్‌ విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే, వరుసగా నాలుగేళ్లు సెమీస్‌కే పరిమితం అవుతున్న జ్వెరెవ్ తొలిసారి ఫైనల్‌ చేరాడు. ఆదివారం జరిగే ఫైనల్లో వీరిలో ఎవరు గెలిచినా మొదటిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌ గా నిలవనున్నారు.