Begin typing your search above and press return to search.

వరల్డ్ కప్ లో టీ-10:... లైవ్ లో హైలైట్స్ చూపించిన మ్యాక్స్ “వెల్ డన్”!

ఆఫ్గన్ ఇచ్చిన 292 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ మొదట్లో తడబడింది. తమ విరోచిత ఫాం ని కంటిన్యూ చేస్తూ ఆఫ్గన్ టీం బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇస్తుంది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 4:04 AM GMT
వరల్డ్  కప్  లో టీ-10:... లైవ్  లో హైలైట్స్  చూపించిన మ్యాక్స్  “వెల్  డన్”!
X

వన్డే ప్రపంచకప్‌ మరో సంచలనం నమోదైంది. ఈ సమయంలో ‘సంచలనం’ అనే పదం చిన్నదైంది! ముంబయి వేదికగా అఫ్గానిస్థాన్‌ తో జరిగిన మ్యాచ్‌ లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. కాదు.. కాదు... మ్యాక్స్‌ వెల్ ఆసీస్ కు కొన్ని దశాబ్ధాలపాటు గుర్తుండే విజయాన్ని అధించాడు.

128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 201 పరుగులు! ఈ నెంబర్స్ చూడటం ఈ జనరేషన్ క్రికెట్ అభిమానులు లైవ్ లో చూడటం అదృష్టం అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! ఈ ఇన్నింగ్స్ చూస్తున్నవారికి ఒక దశలో హైలైట్స్ చూస్తున్నామా.. లైవ్ చూస్తున్నామా అనే అనుమానం కలిగినా ఆశ్చర్యం లేదు!

91-7 నుంచి 292-7 వరకూ:

ఆఫ్గన్ ఇచ్చిన 292 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ మొదట్లో తడబడింది. తమ విరోచిత ఫాం ని కంటిన్యూ చేస్తూ ఆఫ్గన్ టీం బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇస్తుంది. ఇందులో భాగంగా 91 పరుగులకే 7 కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో... ఆఫ్గన్ కి మరో హిస్టారికల్ విక్టరీ రెడీ అని అంతా అనుకున్నారు! కాస్త క్రికెట్ పై అవగాహన ఉన్నవారేవరైనా.. అప్పటివరకూ ఆ 7 వికెట్లు పడిన తీరు చూసిన ఎవరైనా అదే అనుకున్నా తప్పులేదు!

కానీ... “మనిషి ఊహించకుండా జరిగేవే అద్భుతాలు.. మనిషి ఊహకు అందని ఫెర్ఫార్మెన్స్ లే సంచలనాలు”! అదే జరిగింది. అలాంటి అద్భుతమే ఆవిషృతమైంది. అటువంటి సంచలనమే నమోదైంది. "మ్యాక్స్‌... వెల్ డన్" అనిపించే ఇన్నింగ్స్ రికార్డ్ అయ్యింది. మరో ఎండ్ లో కెప్టెన్ కమిన్స్ "గోడ"లా నిలబడగా.. ఈ ఎండ్ లో మ్యాక్స్‌ వెల్ కనీ వినీ ఎరుగని "టీ-10" మ్యాచ్ ఆడాడు. ఫలితంగా ఇంకా 19 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించేశాడు.

కండరాల నొప్పిని పక్కన పెట్టిన కసి!:

తాజాగా ఆఫ్గన్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్‌ వెల్ పరిస్థితి చూసిన ఎవరికైనా అతను చివరి వరకూ ఆడటం కష్టమనే అనుకుంటారు! పరుగులు తీయడం సంగతి దేవుడెరుగు.. క్రీజ్ లో సరిగా నిలబడలేని పరిస్థితి మ్యాక్స్‌ వెల్ ది. పలుమార్లు ఫిజియో రావడం.. టెంపరరీ రిలీఫ్ ఇవ్వడం.. మళ్లీ కాసేపటి తర్వాత సేం పరిస్థితి. అయినా... అలా ఒంటికాలితో అన్నట్లుగా వీరోచిత పోరాటం చేశాడు మ్యాక్స్‌ వెల్

ఒకానొక దశలో ఆ కండరాల నొప్పితో మరింతగా విలవిల్లాడిపోయాడు మ్యాక్స్ వెల్. ఇతని పెయిన్ చూసి ఆడటం సాధ్యం కాకపోవచ్చని... నెక్స్ట్ బ్యాట్స్ మెన్ కూడా రెడీ అయ్యి బౌండరీ లైన్ వరకూ వచ్చాడు. బట్... మ్యాక్స్‌ మళ్లీ లేచి నిలబడ్డాడు. మ్యాచ్ గెలిచే వరకూ బయటకు రాను అన్నట్లుగా ఫిక్స్ అయినట్లున్నాడు. ఆ నొప్పిని భరిస్తూనే కోట్ల మంది క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ని చూపించాడు.

నాడు కపిల్ - నేడు మాక్స్ వెల్:

ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత గొప్ప ఇన్నింగ్స్‌ గురించి చర్చ వచ్చినపుడల్లా.. ఆల్ మోస్ట్ అంతా మాట్లాడుకునేది జింబాబ్వేపై కపిల్‌ దేవ్‌ 1983లో ఆడిన ఇన్నింగ్స్‌ గురించే! ఆ మ్యాచ్ లో కపిల్ డెవిల్స్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆల్ మొస్ట్ అంతా రేడియోలు కట్టేసి ఉంటారు! అంతా ఆశలు వదిలేసుకున్నారు. కానీ కపిల్ వదులుకోలేదు! ఫలితంగా... స్కోర్ బోర్డ్ 17/5 నుంచి 266/8కి చేరింది. ఇది చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం.

సైన్యం మొత్తం మట్టికరిచినా... తాను మాత్రం "బాహుబలి"లా నిలబడ్డాడు కపిల్. డూ ఆర్ డై అన్నట్లుగా పోరాటం సాగించాడు. కొడితే కొట్టాలిరా ఇలా కొట్టాలి అన్నట్లుగా తర్వాత తరాలకు షాట్లు, పోరాట పటిమ పరిచయం చేశాడు! కపిల్‌ అద్భుత విన్యాసాలను నాడు లైవ్ లో చూసినవాళ్లు చెప్పే మాటలకు రోమాలు నిక్కబొడుచుకుంటాయని చెప్పొచ్చు!

నాడు కపిల్ ఫెర్మార్మెన్స్ చూడని ఇప్పటి జనరేషన్ తాజాగా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న ఆసిస్ ని మ్యాక్స్‌ వెల్ ఆదుకున్న తీరు చూసి ఒక క్లారిటీకి రావొచ్చు. అప్పట్లో కపిల్ ఇన్నింగ్స్ ఎలా నడిచి ఉంటుందని చెప్పడానికి. అప్పట్లోనే కపిల్ ఒక్కడే 175 పరుగులు చేశాడు! ఇప్పుడు మ్యాక్స్‌ వెల్ 201 పరుగులు చేసి నాటౌట్ గా నిలబడ్డాడు. టీం ని సెమీస్ లో నిలబెట్టాడు!

అవి లైఫ్ లు కాదు.. ఆరంభంలో ప్రకృతి పరీక్షలు!:

మ్యాక్స్‌ వెల్ 33 వ్యక్తిగత పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక లైఫ్ దొరికింది. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఇప్పుడు మ్యాక్స్‌ వెల్ గురించిన ఇంత చర్చ జరిగేది కాదు. అనంతరం ఒక దశలో అంపైర్‌ ఎల్బీడబ్ల్యూ ఇస్తే తన కథ ముగిసిందనుకున్నారు. కానీ రివ్యూ కోరి బయటపడ్డాడు. అయితే ఈ ఫెర్మార్మెన్స్ చూసిన తర్వాత... అవి "లైఫ్" లు కాదు.. అద్భుతం జరిగే ముందు ఎదురయ్యే చిన్న చిన్న అవాంతరాలు, ప్రకృతి పెట్టిన పరీక్షలు అని కొట్టిపారేస్తున్నారు అభిమానులు!

అవును... నూర్ అహ్మద్ వేసిన 22వ ఓవర్‌ లో షార్ట్ ఫైన్ లెగ్‌ లో మ్యాక్స్‌ వెల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ ను ముజీబ్ రెహ్మాన్ నేలపాలు చేశాడు. అప్పటికీ మ్యాక్స్‌ 33 పరుగులు మాత్రమే చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన "మ్యాక్స్"... అఫ్గాన్ ఓటమిని శాసించి "వెల్ డన్" అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

మ్యాక్స్ వెల్ నెలకొల్పిన రికార్డ్స్ ఇవే!:

తాజాగా చేసిన డబుల్ సెంచరీతో... వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆస్ట్రేలియన్ ప్లేయర్ గా మ్యాక్స్ వెల్ రికార్డ్ సృష్టించాడు.

ప్రపంచకప్‌ లో మాత్రమే కాదు.. వన్డే చరిత్రలోనే ఛెజింగ్ లో ఒక బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఈ దెబ్బతో... ఫకార్‌ జమాన్‌ (193: దక్షిణాఫ్రికాతో)ను అధిగమించాడు.

ఇదే సమయంలో వన్డేల్లో ఆరో నంబర్‌ బ్యాటర్‌ కు ఇదే అత్యధిక స్కోరు. ఒకప్పుడు కపిల్‌ దేవ్‌ (175) పేరున ఈ రికార్డ్ ఉండేది!

వన్డే ప్రపంచకప్‌ లో ఇది మూడో డబుల్ సెంచరీ. ఫస్ట్... క్రిస్‌ గేల్‌ (215), మార్టిన్‌ గప్టిల్‌ (237 నాటౌట్‌) తర్వాత మ్యాక్స్ వెల్ (201 నాటౌట్) నిలిచాడు.