Begin typing your search above and press return to search.

అదరగొట్టిన యువ భారత్... టీ20 సిరీస్ కైవసం!

ఇందులో భాగంగా... జింబాబ్వే తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సీరిస్ లో ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది.

By:  Tupaki Desk   |   13 July 2024 5:36 PM GMT
అదరగొట్టిన యువ భారత్...  టీ20 సిరీస్  కైవసం!
X

ఇటీవల ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను సాధించిన అనందంలో ఉన్న టీమిండియా క్రికెట్ అభిమానులకు ఇప్పుడు యువ క్రికెటర్లు కూడా గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగా... జింబాబ్వే తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సీరిస్ లో ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. దీంతో భారత్ క్రికెట్ అభిమానుల ఆనందం రెట్టింపయ్యింది.

అవును... టీ20 ప్రపంచ కప్ సాధించిన సీనియర్లు విశ్రాంతిలో ఉండగా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యూవ భారత్ అదరగొట్టింది. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదట మ్యాచ్ లో తడబడి బోల్తా కొట్టిన జట్టు... తర్వాత వరుసగా మూడు మ్యాచ్ లలోనూ సత్తా చాటింది. ఫలితంగా ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.

శనివారం జరిగిన నాలుగో టీ20లో టీంఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్స్ లో కెప్టెన్ సికిందర్ రజా 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ లతో 46 పరుగులు చేశాడు.. ఉన్నంత సేపూ దూకుడుగా ఆడాడు.

ఇక మిగిలిన బ్యాటర్స్ లో ఓపెనర్లు మధెవర్ (25), మరుమాని (32), కెప్టెన్ సికిందర్ రజా (46) లు రాణించగా... డియోన్ మేయర్స్ (12), బ్రియాన్ బెనెట్ (9), మండాడే (7), జొనాథన్ క్యాంప్ బెల్ (3) తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరారు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, శివం దుబె, అభిషేక్ శర్మ, సుందర్, తుషార్ దేశ్ పాండే తలో వికెట్ పడగొట్టారు.

ఇక 153 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన టీం ఇండియా ఓపెనర్లు చెలరేగిపోయారు. వికెట్ నష్టపోకుండా పని పూర్తి చేశారు. ఇందులో భాగంగా... యశస్వీ జైస్వాల్ (93: 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్ లు) వీర బదుడు బాదగా... అతడికి మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (58: 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లు) సహకరించాడు.