Begin typing your search above and press return to search.

కోహ్లీ, కేఎల్ భార్యల‌పై బజ్జీ కామెంట్.. నెటిజన్ల డిమాండ్ ఇదే!

ఆదివారం అహ్మదాబాద్‌ లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 9:23 AM GMT
కోహ్లీ, కేఎల్  భార్యల‌పై బజ్జీ కామెంట్.. నెటిజన్ల డిమాండ్  ఇదే!
X

ఆదివారం అహ్మదాబాద్‌ లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు బాధ‌లో మునిగిపోయారు. ఇంకొంతమంది ఫైనల్ ఫోబియా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఆటలో గెలుపోటములు సహజం... ఇప్పటికీ ఈ టోర్నీలో ఇండియానే బెస్ట్ అని అంటున్నారు.

ఇదే క్రమంలో ప్రధాని మోడీ కూడా స్పందించారు. దేశం మొత్తం టీం ఇండియాకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ ల భార్యలైన అనుష్క శర్మ, అతియా శెట్టిలపై మాజీ క్రికెటr హ‌ర్భజ‌న్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వాటిని అసందర్భం ప్రేళాపనలుగా పలువురు కొట్టివేస్తుంటే.. మరికొందరు బజ్జీని వాయించేస్తున్నారు!

తాజాగా ఆదివారం జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడ‌డంతో పాటు వారి భ‌ర్తల‌ను ఎంకరేజ్ చేసేందుకు అనుష్క శ‌ర్మ, అతియా శెట్టిలు స్టేడియానికి వ‌చ్చారు. వీరిద్దరు స్టాండ్స్‌ లో ప‌క్కప‌క్కనే కూర్చున్నారు. ఈ సమయంలో అప్పుడ‌ప్పుడూ కెమెరాలు ఈ ఇద్దరిని ఫోక‌స్ చేశేవి. వీరిద్దరి ముచ్చట్లను, రియాక్షన్ లను కవర్ చేసేవి

అయితే ఆ స‌మ‌యాల్లో ఈ ఇద్దరూ కూడా ఏదో విష‌య‌మై సీరియ‌స్‌ గా చ‌ర్చించుకుంటున్నట్లు కనిపించింది. టీం ఇండియా 17.4 ఓవర్లలో 106 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన సమయంలో.. కొహ్లీ - రాహుల్ లు క్రీజ్ లో ఉన్నారు. ఈ సమయంలో స్టాండ్స్ లో ఉన్న అనుష్క - అతియా లు ఏదో విష‌య‌మై చ‌ర్చించుకుంటున్నట్లు కనిపించింది. ఈ సమయమంలో వారిద్దరినీ స్క్రీన్ పై చూసిన బజ్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి.

అవును... అనుష్క శర్మ - అతియా శెట్టీ ఏదో విషయమై చర్చించుకుంటున్న సమయంలో... హిందీ కామెంట‌రీ బాక్స్‌ లో ఉన్న భార‌త మాజీ ఆట‌గాడు హ‌ర్భజ‌న్ సింగ్ వీరిద్దరిని ఉద్దేశించి ప‌లు వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... "వాళ్లు ఇద్దరూ సినిమాలు, ప్రకటనల గురించి మాట్లాడుకుంటూ ఉండొచ్చు.." అని అన్నాడు. దీంతో... వాళ్లకు క్రికెట్ గురించి ఏమీ తెలియ‌దు అనే ఉద్దేశ్యంలో మాట్లాడాడంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు!

దీంతో హర్భజన్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. భజీ మాటలు పురుషాధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఈ సందర్భంగా ప‌లువురు నెటిజన్లు మండిప‌డుతున్నారు. దీంతో భజ్జీ వెంటనే... అనుష్కశ‌ర్మ, అతియా శెట్టిల‌కు బహిరంగ క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం భజ్జీ వ్యాఖ్యలు, నెటిజన్ల రియాక్షన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి!