Begin typing your search above and press return to search.

ఆమె (అతడు).. మరి ఒలింపిక్ స్వర్ణం వెనక్కి తీసేసుకుంటారా..?

మళ్లీ దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఈ వివాదం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   5 Nov 2024 11:38 AM GMT
ఆమె (అతడు).. మరి ఒలింపిక్ స్వర్ణం వెనక్కి తీసేసుకుంటారా..?
X

ఈ ఏడాది అందాల నగరం పారిస్ లో అత్యంత అట్టహాసంగా జరిగిన ఒలింపిక్స్ పలు వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. నిర్వహణ దగ్గర నుంచి వీడ్కోలు వరకు పలు అంశాలు విమర్శలు పాలయ్యాయి. వీటిలో ఒకటి మాత్రం మరింత తీవ్రమైనది. అదేమంటే ఒలింపిక్స్ లో అత్యున్నతమైన స్వర్ణ పతకం సాధించిన ఓ అథ్లెట్ విషయంలో కావడం గమనార్హం. మళ్లీ దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఆమె (అతడు) అని.. సంచలనం రేపుతోంది.

ఎవరీమె (ఇతడు)?

అల్జీరియా.. ఈ ఆఫ్రికా దేశం మామూలుగా అయితే చర్చల్లో ఉండదు. పారిస్‌ ఒలింపిక్స్‌ లో మాత్రం వార్తల్లో నిలిచింది. ఎందుకంటే.. ఈ దేశానికి చెందిన బాక్సర్‌ ఇమానె ఖెలిఫ్‌ కారణంగా. ఖెలిఫ్‌ లింగ గుర్తింపు వైద్య నివేదిక బయటపడడం.. ఆమె (అతడు) శరీరంలో అంతర్గంతగా వృషణాలు, ఎక్స్‌వై క్రోమోజోములు ఉన్నట్లు తేలడమే దీనికి కారణం. అయితే, ఇది 5 ఆల్ఫా రిడక్టేజ్‌ ఇన్‌ సఫిసియెన్సీ అనే రుగ్మతను సూచిస్తుంది.

ఆ పంచ్ లకు..

పారిస్‌ క్రెమ్లిన్‌ బికెట్రే ఆసుపత్రి, అల్జీరియాకు చెందిన మొహమ్మద్‌ లామినే ఆసుపత్రి వైద్యులు ఇమానెపై 2023 జూన్‌లో వెల్లడించిన నివేదిక ప్రకారం అంతర్గతంగా వృషణాలు ఉన్నా.. గర్భసంచి లేదు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ లో ఇతర జననాంగాలు మాత్రం ఉన్నాయి. ఈ కారణాలతోనే ఇమానె పురుషుడని నిర్ధరణ అయినట్లు సోషల్‌ మీడియాలో హల్ చల్ రేగింది. ఇక ఆగస్టు నెలలో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌ లో ఇటలీ బాక్సర్‌ ను 66 కేజీల ప్రి క్వార్టర్స్‌ లో 46 సెకన్లలోనే ఇమానె ఓడించింది. అయితే, ఈ బౌట్ లో ఇమానె పంచ్‌ లకు ఇటలీ బాక్సర్‌ కుప్పుకూలి రోదించింది. దీంతో ఇమానెలో ఇంత పవర్ ఎక్కడిది? ఆమె ‘అతడు’ అని వివిధ దేశాల వారు విమర్శలకు దిగారు. పోటీల్లోకి ఎలా అనుమతించారంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీపైనా విరుచుకుపడ్డారు. కాగా, 2023లో ఢిల్లీలో వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్ లోనే లింగ వివాదం కారణంగా ఇమానెను ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ తప్పించింది. అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ మాత్రం పారిస్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది. ఫైనల్లో చైనా బాక్సర్ యాంగ్‌ లియూను ఓడించి స్వర్ణం నెగ్గింది.

ఖెలిఫ్‌ ‘ఆమె’ కాదంటూ ఒలింపిక్స్ సందర్భంగా వాదించినా ఫలితం లేకపోయింది. అయితే, ఆమె జెండర్‌ పై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. లింగ గుర్తింపు నివేదిక లీక్‌ కావడంతో భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ స్పందించాడు. ‘ఆమె’ నుంచి స్వర్ణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఖెలిఫ్‌ పురుషుడేనని తేలడంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి.