హార్దిక్ పాండ్య-నటాషా విడాకులు తూచ్!
హార్దిక్ పాండ్య-నటాషా స్టాంకోవిచ్ విడిపోతున్నట్లు నెట్టింట ఏ రేంజ్ లో ప్రచారం జరుగుతుందో తెలిసిందే.
By: Tupaki Desk | 14 Jun 2024 6:51 AM GMTహార్దిక్ పాండ్య-నటాషా స్టాంకోవిచ్ విడిపోతున్నట్లు నెట్టింట ఏ రేంజ్ లో ప్రచారం జరుగుతుందో తెలిసిందే. కొన్ని రోజులుగా అయితే ఈ ప్రచారం ఏకంగా పీక్స్ కి చేరిపోయింది. తీవ్రమైన విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నారని..పాండ్య ఆస్తిలో 70 శాతం నటాషా డిమాండ్ చేస్తుందని...కానీ తెలివిగా ఆస్తులన్నింటిని పాండ్య తన తల్లి పేరిట పెట్టాడని....ఇలా అయితే నటాషా నష్టపోతుందని ఓ రేంజ్ లో మీడియా కథనాలు ఊదరగొట్టాయి.
అయితే 15 రోజుల క్రితం నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగినట్లు కనిపించింది. ఇదంతా ప్రచారమే? అన్న సందేహం అభిమానుల్లో మొదలైంది. తాజాగా అన్ని రకాల ప్రచారం అనంతరం హార్దిక్ పాండ్యా మొదటిసారిగా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ ప్రకటన చేశాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ భారత ఆటగాళ్లను ప్రశంసించారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆడుతు న్న అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లను కలిశారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో వన్ టు వన్ అంటూ ముచ్చటించాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.హార్దిక్ పాండ్యా ని ఉద్దేశించి రికీ పాటింగ్ ఇలా అన్నారు. అంతా ఎలా జరుగుతోంది? మీ కుటుంబం ఎలా ఉంది అంటే? ఆర్దిక్ స్పందిస్తూ `ఆల్ గుడ్ ..ఆల్ స్వీట్` అన్నాడు.
దీనికి సంబంధించిన వీడియోని నెట్టింట వైరల్ అవుతుంది. పాండ్య సమాధానం బట్టి నటాషా ఇద్దరు విడిపోలేదని..ధాంపత్య జీవితంతో సంతోషంగా సాగుతుందని ఓ క్లారిటీ వస్తుంది. నటాషా ఇన్ స్టా ఫోటోలు కూడా వాళ్ల సఖ్యతని తెలియజేస్తున్నాయి. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే.