హార్ధిక్ పాండ్య ఇక ముంబై జట్టు కెప్టెన్...!
ఇక పోతే వచ్చే ఐపీఎల్ సీజన్ లో తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటూ ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ చేసిన సంచలన ప్రకటనతో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ శకం ముగిసినట్టయింది అంటున్నారు.
By: Tupaki Desk | 15 Dec 2023 1:29 PM GMTటీం ఇండియా స్టార్ క్రికెటర్ ప్లస్ ఆల్ రౌండర్ అయిన హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా తీసుకున్నారు. ఇది ఇపుడు సంచలన నిర్ణయంగానే అంతా చూస్తున్నారు. ఎందుకంటే హార్ధిక్ పాండ్య అద్భుతమైన క్రికెటర్. అలాగే అన్ని జానర్స్ నుంచి కూడా ఆడే సత్తా ఉన్న వారు.
ఇపుడు ఆయనను ముందుకు తెచ్చి ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ఒక విధంగా సెన్షేషనల్ గా ఉంది. అంటున్నారు. అయితే ఈ విషయాన్ని పీటీఐ వెల్లడించింది. అదే విధంగా ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇటీవల మొన్న ఐపీఎల్ ఆటగాళ్ల ట్రేడింగ్ సమయంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.15 కోట్లు చెల్లించి మరీ గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ఎందుకు కొనుగోలు చేసింది
ఇక పోతే వచ్చే ఐపీఎల్ సీజన్ లో తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటూ ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ చేసిన సంచలన ప్రకటనతో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ శకం ముగిసినట్టయింది అంటున్నారు. అయితే ఇప్పటిదాకా చూసుకుంటే ముంబయి జట్టుకు రికార్డు స్థాయిలో 5 ఐపీఎల్ టైటిళ్లు అందించిన ఘన చరిత్ర రోహిత్ సొంతం అని చెప్పాల్సి ఉంది.
కానీ ఇటీవల కాలంలో చూస్తే కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ప్రదర్శన దిగజారుతూ వస్తోంది. ఈ కారణంగానే హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్ గా నియమించినట్టు తెలుస్తోంది అని విశ్లేషిస్తునారు. ఇక మరో వైపు చూస్తే హార్ధిక్ పాండ్యాకు ముంబయి ఇండియన్స్ కు కొత్తేమీ కాదు.ఆయన గతంలో ఏడు సీజన్ల పాటు ముంబయికి ఆడాడు.
ఇక పాండ్యా సామర్థ్యంపై నమ్మకంతోనే ముంబయి ఇండియన్స్ కోట్లు వెచ్చించి మరీ అతడిని తిరిగి తీసుకొచ్చింది అని అంటున్నారు. దీనిపై ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పందిస్తూ జట్టును భవిష్యత్ కోసం సిద్ధం చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ గ్లోబల్ పెర్ఫార్మెన్స్ హెడ్ మహేల జయవర్ధనే ఓ ప్రకటన చేశారు. సో ఇక మీదట పాండ్యా శకం మొదలవుతోంది అన్న మాట.