కొడుకుతో పాండ్యా.. ఫోటోల్లో నటాషా మిస్సింగ్
హార్థిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ జంట నడుమ ఏం జరుగుతోందో తెలియని కన్ఫ్యూజన్ అభిమానుల్లో నెలకొంది.
By: Tupaki Desk | 6 July 2024 7:23 AM GMTహార్థిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ జంట నడుమ ఏం జరుగుతోందో తెలియని కన్ఫ్యూజన్ అభిమానుల్లో నెలకొంది. ఆ ఇద్దరూ కలిసే ఉన్నారా? విడిపోయారా? అంటూ సోషల్ మీడియాల్లో బోలెడంత చర్చ సాగుతోంది. ఈ జంట ఇప్పటివరకూ దేనినీ కన్ఫామ్ చేయలేదు. కానీ నటాషా సోషల్ మీడియాల్లో రకరకాల పోస్టింగులతో అగ్నికి ఆజ్యం పోస్తోంది. పాండ్యాతో అంతా సవ్యంగా లేదని సందేహాలు కలిగేలా ప్రవర్తిస్తోంది.
ముఖ్యంగా టీమిండియా టి-20 ప్రపంచకప్ విన్ అయినా కానీ, నటాషా నుంచి స్పందన లేదు. హార్థిక్ గురించి కానీ, ఇండియా విజయం గురించి కానీ ఎలాంటి పోస్టులు చేయలేదు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ విజయాన్ని కొడుకుతో సెలబ్రేట్ చేసుకుంటున్న ఫోటోల్లో నటాసా స్టాంకోవిచ్ మిస్సయింది. ఆమె కనిపించకపోవడంతో మరోసారి సందేహాలు రాజుకున్నాయి.
గత శనివారం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియాకు విజయం సాధించిన తర్వాత హార్డిక్ పాండ్యా నేరుగా నటాషాకు ఫోన్ చేసాడని కథనాలొచ్చాయి. కానీ.. అది నిజమా కాదా? అన్నదానిపై స్పష్ఠత లేదు. ఇప్పుడు తన కుమారుడు అగస్త్యను తిరిగి కలిశాడు. తనయుడితో ఆనందంగా కనిపించాడు. హార్దిక్ తన కుమారుడితో రీయూనియన్ నుండి కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు.. కానీ అతడి భార్య నటాసా స్టాంకోవిక్ ఈ ఫోటోల్లో కనిపించకపోవడం అనుమానాలు రేకెత్తించింది.
పాండ్యా జూనియర్ పాండ్యాతో కేక్ కట్ చేస్తున్నప్పుడు .. నీలిరంగు బెలూన్లతో కలిసి పోజులిచ్చిన ఫోటోలను షేర్ చేస్తూ హార్దిక్ ఇలా వ్రాశాడు, ``నా #1! నేను చేసేదంతా నీ కోసమే చేస్తాను`` అని కొడుకుపై ప్రేమను కురిపించాడు. ఈ ఫోటోలను ఎవరు క్లిక్ చేసారో లేదా వీడియోను ఎవరు చిత్రీకరించారో తెలియదు కానీ నటాసా కీలకమైన ఈవెంట్ నుండి మిస్సయిపోవడం చర్చగా మారింది.