Begin typing your search above and press return to search.

హర్మిత్ - రోహిత్... ఓ పాత మధుర జ్ఞాపకం!

ఈ క్రమంలో ఎలాగైతేనే 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.

By:  Tupaki Desk   |   14 Jun 2024 6:08 AM GMT
హర్మిత్ - రోహిత్... ఓ పాత మధుర జ్ఞాపకం!
X

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024 సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో తాజాగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇందులో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేయగా... ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీం ఇండియా బ్యాటర్లు చెమటోడ్చాల్సి రావడం గమనార్హం.

ఈ క్రమంలో ఎలాగైతేనే 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ఆ సంగతి అలా ఉంటే... అమెరికా జట్టులో సగానికిపైగా భారతి సంతతి ఆటగాల్లు ఉండటం.. వారు బాగా రాణిస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా భారత్ తో మ్యాచ్ కు ముందు అమెరికా ఆటగాల్లు సౌరభ్ నేత్రావల్కర్, హర్మిత్ సింగ్, మొనాంక్ పటేల్ లు టీంఇండియా ప్లేయర్స్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

అవును... అమెరికా జట్టులో ఉన్న భారతి సంతతి ఆటగాల్లైన సౌరభ్ నేత్రావల్కర్, హర్మిత్ సింగ్, మొనాంక్ పటేల్ లు టీం ఇండియా ఆటగాళ్లతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తో ఉన్న ఒక ఆపాత మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు హర్మిత్ సింగ్. ఇందులో భాగంగా ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన హర్మీత్ సింగ్... రోహిత్ ది తనదీ ఒకటే స్కూల్ అని, కాకపోతే తాను స్కూల్లో చేరేసరికి రోహిత్ గ్రాడ్యుయేట్ అయ్యాడని తెలిపారు. తన ఫస్ట్ క్లాస్ ఎంట్రీ మ్యాచ్ లో రోహిత్ కూడా ఉన్నాడని.. అతడు తనకంటే ముందు అండర్ 19 వరల్డ్ కప్ వంటి కొన్ని టోర్నమెంట్ లు ఆడారని వెల్లడించారు. ఈ సందర్భంగా ముంబై ఆటగాళ్లు అంతర్జాతీయ అస్థాయిలో అదరగొడుతుండటం ఆనందంగా ఉందని హర్మిత్ సింగ్ చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు నేత్రావల్కర్. ఇందులో భాగంగా సూర్య తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని.. అతడిని అండర్-15 నుంచి చూస్తున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో... అండర్-15, అండర్-17ల్లో అతడు డబుల్ సెంచరీలు చేశాడని.. అతడు ఎప్పుడూ ప్రత్యకమైన ఆటగాడని.. ఇంతకాలం తర్వాత అతడిని కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు.

అదేవిధంగా... మోనాంక్ పటేల్ కూడా టీం ఇండియాలోని కొంతమంది ఆటగాళ్లతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇందులో భాగంగా.. తాను అండర్-1, అండర్-19 మ్యాచ్ లలో అక్షర్ పటేల్, బూమ్రాతో కలిసి ఆడినట్లు తెలిపారు. అక్షర్ పటేల్, తాను గుజరాత్ లోని ఒకే పట్టణం నుంచి వచ్చినట్లు తెలిపారు. అతడు ఎదుగుదల తనకు సంతోషానిస్తుందని మోనాంక్ పటేల్ వెల్లడించాడు.