హిస్టరీ క్రియేట్ చేసిన హర్షిత్ రాణా.. క్రికెటర్లకు పండగే!
తాజాగా.. మరో యువ క్రికెటర్.. హర్షిత్ రాణా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు..
By: Tupaki Desk | 1 Feb 2025 12:30 PM GMTటీం ఇండియాలో యువ కెరటాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మన ఏపీకి చెందిన శ్రీకాకుళం కుర్రాడు కూడా.. అద్భుతమైన ప్రతిభను చూపించి.. క్రికెట్ ప్రియుల మనసు దోచుకున్నారు. తాజాగా.. మరో యువ క్రికెటర్.. హర్షిత్ రాణా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.. శుక్రవారం పూణే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి అడుగు పెట్టాడు. అయితే.. తుది జట్టులో హర్షిత్ లేకపోయినా.. `కంకషన్ సబ్‌స్టిట్యూట్`గా హర్షిత్ ఎంట్రీ ఇవ్వడమే రికార్డ్ అని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు.
ఫస్ట్ టైమ్!
ఇంటర్నేషనల్ టీ-20లో భారత యువ కెరటం పార్టిసిపేషన్..ఇదే తొలిసారని దిగ్గజాలు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రపంచ క్రికెట్‌లో ముఖ్యంగా `పొట్టి ఫార్మాట్`లో అరంగ్రేటం చేసిన మొదటి ఆటగాడిగా కూడా హర్షిత్ రికార్డు సృష్టించాడు. క్రికెట్ చరిత్రలో టెస్టులు, వన్డేలు కలిపి ఇప్పటి వరకు ఆరుగురు ఆటగాళ్లు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అరంగ్రేటం చేశారు. ఇప్పుడు హర్షిత్ రాణా ఎంట్రీ ఇవ్వడంతో ఏడో ఆటగాడిగా నిలిచాడు.
అరంగేట్రంలోనే అదరహో!
హర్షిత్ రాణా.. తన ఎంట్రీలోనే అద్భుతాలు కురిపించాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో హర్షిత్ భారత విజయంలో కీలక పాత్ర పోషించినట్టు అయింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ బ్యాంటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. శివమ్ దూబె53 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా కూడా 53 పరుగులతో అంటే.. హాఫ్ సెంచరీలతో ఇరగదీశారు.
హర్షిత్ ఇలా ఎంట్రీ..
మ్యాచ్ రిఫరీ అనుమతితో దూబె స్థానంలో(తనకు తలనొప్పిగా ఉందనడంతో) కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణా ఎంట్రీ ఇచ్చాడు. రాణాతో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.