Begin typing your search above and press return to search.

బస్సు డ్రైవర్ సలహా.. కోహ్లి ఆఫ్ స్టంప్ ఎగరగొట్టిన బౌలర్!

గత వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో రైల్వేస్ తో రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలో దిగాడు కోహ్లి. దేశవాళీల్లో అతడికి 12 ఏళ్ల తర్వాత ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   4 Feb 2025 9:38 AM GMT
బస్సు డ్రైవర్ సలహా.. కోహ్లి ఆఫ్ స్టంప్ ఎగరగొట్టిన బౌలర్!
X

16 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్న టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి.. దాదాపు 13 ఏళ్ల కిందటే తన తీవ్ర బలహీనత అయిన ‘ఆఫ్ స్టంప్’ పడే బంతిని అధిగమించాడు. అలాంటివాడు గత కొన్నాళ్లుగా మళ్లీ అదే బలహీనతకు ఔట్ అవుతున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ సిరీస్ సందర్భంగా దాదాపు ప్రతిసారి కోహ్లి ఆఫ్ స్టంప్ పడే బంతిని ఆడే ఔటయ్యాడు. దీంతో కోహ్లి కథ మొదటికి వచ్చిందా? అనే అనుమానాలు బలపడ్డాయి. ఈ వైఫల్యాన్ని చూసి బీసీసీఐ కూడా స్పందించింది. స్టార్ ఆటగాళ్లు సైతం రంజీట్రోఫీలు ఆడాల్సిందే అనేంతగా ఆదేశాలిచ్చేవరకు వెళ్లింది పరిస్థితి.

గత వారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో రైల్వేస్ తో రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలో దిగాడు కోహ్లి. దేశవాళీల్లో అతడికి 12 ఏళ్ల తర్వాత ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. వాస్తవానికి రంజీల్లో ముంబై, కోల్ కతా, కర్ణాటక, సౌరాష్ట్ర వంటి జట్లు బలమైనవి. రైల్వేస్ సాధారణ జట్టు మాత్రమే. దీంతో కోహ్లి ఆ జట్టుపై సులువుగా పరుగులు సాధించేస్తాడని భావించారు. కానీ, చివరకు జరిగింది వేరు.

రైల్వేస్ పేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్.. 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ బరిలో దిగిన కోహ్లిని కేవలం 6 పరుగులకే ఔట్ చేసి బౌలర్. అది కూడా కోహ్లి బలహీనతను గుర్తుపెట్టుకుని మరీ గురిపెట్టినట్లు క్లీన్ బౌల్డ్ చేశాడు. పట్టుమని 15 బంతుల్లోనే కోహ్లి ఔటవడంతో హిమాన్షు వార్తల్లో నిలిచాడు.

బెంగాల్ కు షమీ, ముకేశ్ కుమార్, కర్ణాటకకు ప్రిసిద్ధ్, విద్వత్ కావేరప్ప, ముంబైకి శార్దూల్ ఠాకూర్ వంటి పేసర్లున్నారు. కానీ, హిమాన్షు దేశవాళీల్లో పెద్దగా పేరులేని బౌలర్. అలాంటివాడు కోహ్లి బలహీనతను గురిపెట్టి ఔట్ చేయగలిగాడు. దీంతో అతడికి ఇది ఎలా సాధ్యమైంది? అనే ప్రశ్నలు వచ్చాయి.

మనలో చాలామందికి క్రికెట్ నాలెడ్జ్ విపరీతంగా ఉంటుంది. అత్యంత సాధారణ ప్రజలకూ క్రికెట్ గురించి లోతైన సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది. ఇలాంటివారిలో ఓ బస్ డ్రైవర్ కూడా ఉండొచ్చు. హిమాన్షుకు కోహ్లి వికెట్‌ ఎలా తీయాలో చెప్పింది కూడా ఆ బస్సు డ్రైవరే.

కోహ్లికి ఫిఫ్త్ స్టంప్‌ లైన్‌ లో బౌలింగ్‌ చేయాలని బస్ డ్రైవర్ సూచించినట్లు హిమాన్షు చెప్పాడు. దీనిని విని తాను షాకయ్యానని.. అయితే, కోహ్లి బలహీనత పైనే కాక తన బలాలపై దృష్టిపెట్టి బౌలింగ్‌ చేశానని అతడు తెలిపాడు. కాగా, ఢిల్లీ-రైల్వేస్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అయింది. దీంతో హిమాన్షు ఎవరా? అని అభిమానులు నెట్ లో వెదికారు.

29 ఏళ్ల హిమాన్షు రైల్వేస్ పేస్ బౌలింగ్ ను కొన్నాళ్లుగా నడిపిస్తున్నాడు. కాగా, ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌ కు వెళ్తున్నప్పుడు కోహ్లికి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాడు. బాగా బౌలింగ్ చేశావని కోహ్లీ అతడిని అభినందించాడు. ఔట్ చేసిన బంతి తీసుకుని ఢిల్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌ కు వెళ్లి హిమాన్షు కోహ్లితో ఫొటో దిగాడు.