Begin typing your search above and press return to search.

ఐసీసీ కొత్త ఛైర్మన్ జై షా.. ఆస్తులు, పర్సనల్ లైఫ్ గురించి తెలుసా?

ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

By:  Tupaki Desk   |   28 Aug 2024 7:30 PM GMT
ఐసీసీ కొత్త ఛైర్మన్  జై షా.. ఆస్తులు,  పర్సనల్  లైఫ్  గురించి తెలుసా?
X

బీసీసీఐ కార్యదర్శి జై షా... తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దీంతో... ఐసీసీ ఛైర్మన్ అయిన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో... భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్ అయినవారి జాబితాలో ఐదో వ్యక్తిగా షా నిలిచారు.

అవును... భారత్ నుంచి ఇంతకముందు జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ లుగా పనిచేశారు. ఈ జాబితాలో ఐదో వ్యక్తిగా జై షా చేరబోతున్నారు! ప్రస్తుత ఛైర్మన్ గ్రేగ్ బార్ క్లే మరో పర్యాయం ఈ పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకోవడంతో షాకు ఈ అవకాశం లభించింది.

ఈ సందర్భంగా స్పందించిన జై షా... ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా.. క్రికెట్ ను మరింత వ్యాప్తి చేయడానికి ఐసీసీ టీమ్, సభ్య దేశాలతో కలిసి పని చేస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో... క్రికెట్ కు మరింత ఆదరణ పెంచడమే తమ లక్ష్యమని జై షా... ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా జై షా ఆస్తుల విలువపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా నివేదికల అంచనాల ప్రకారం... జై షా నికర ఆస్తుల విలువ సుమారు రూ.100 కోట్ల నుంచు రూ.150 కోట్ల వరకూ ఉండోచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన ఆదాయ వనరు వ్యాపారమే అని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... అగ్రికల్చరల్ కమోడిటీస్ ఇంపోర్ట్, ఎక్స్ పోర్ట్ చేసే "టెంపుల్ ఎంటర్ ప్రైజ్" కంపెనీలో జై షా డైరెక్టర్ గా ఉన్నారు. ఇదే సమయంలో... " కుసుమ్ ఫిన్ సర్వే"లో 60 శాతం వాటాను కలిగి ఉన్నారు.

ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన జై షా... తన కాలేజ్ ఫ్రెండ్ రిషితా పటేల్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

కాగా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడైన జై షాకు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ పై మంచి పట్టు ఉంది. ఈయన తొలుత 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ గా పనిచేశారు.. అనంతరం చిన్న వయసులోనే బీసీసీఐ సెక్రటరీగా పని చేసి.. ఇప్పుడు ఏకంగా ఐసీసీ ఛైర్మన్ గా ఎంపికయ్యారు!