Begin typing your search above and press return to search.

బాబర్ సేన బలం ఇది... రోహిత్ సేన ధైర్యం అది!

వన్ డే ప్రపంచకప్ - 2023 ప్రారంభమైంది. తొలుత కాస్త స్లోగా అనిపించినా.. రాను రానూ రసవత్తర ఘట్టాలే ఆవిషృతమయ్యాయి

By:  Tupaki Desk   |   14 Oct 2023 3:59 AM GMT
బాబర్ సేన బలం ఇది... రోహిత్ సేన ధైర్యం అది!
X

ప్రపంచకప్‌ లో 51 మ్యాచ్‌ లు ఉన్నా.. అందరూ ఎదురు చూసేది ఈ మ్యాచ్‌ కోసమే అని చెప్పినా అతి కాదేమో... ఆస్పత్రి మంచాలు సైతం హోటల్‌ బెడ్‌ లుగా మారిపోతాయని అన్నా అతిశయోక్తి కాదేమో. చరిత్ర మనవైపే ఉంది, వర్తమానంలోనూ మనదే జోరు మీదుంది, భవిష్యత్తు తరాలకూ అదే భరోసా ఇస్తూ టార్గెట్ 8 - 0 కోసం టీం ఇండియా రంగంలోకి దిగుతుంది.

వన్ డే ప్రపంచకప్ - 2023 ప్రారంభమైంది. తొలుత కాస్త స్లోగా అనిపించినా.. రాను రానూ రసవత్తర ఘట్టాలే ఆవిషృతమయ్యాయి. అయితే ఎన్ని రసవత్తర ఘట్టాలు ఆవిషృతమైనప్పటికీ... వాటన్నింటినీ తలదన్నే మ్యాచ్ వచ్చేసింది. క్రికెట్‌ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ తో వరల్డ్ కప్ లో అసలు సిసలు మజాకు తెరలేచింది!

అవును... ప్రపంచ కప్ లో అత్యంత రసవత్తర పోరు ఈ రోజు జరగబోతోంది. మోడీ స్టేడియంలో జరగబోతోన్న ఈ మెగా మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టేడియంలో సుమారు 1.30 లక్షల మంది ప్రేక్షకులు హాజరవ్వనున్నారు. ఇరు దేశాలా జాతీయపతాకాలు రెపరెల పాడుతుంటాయి... సింగిల్ తీసినా స్టేడియంలో కేకలు, ఈలలు వినిపిస్తుంటాయి. ఇక ఫోరో, స్కిక్సో కొడితే థౌసండ్ వాలానే!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే... ఇండియా – పాకిస్థాన్ లు క్రికెట్ మైదానంలో తలపడుతుంటే చూడటం ఓ అద్భుత అనుభవమే. అయితే... ఇప్పటివరకూ వన్డే ప్రపంచకప్‌ లో తలపడ్డ ఏడుసార్లూ పాకిస్థాన్‌ ను ఓడించింది ఇండియా. అది టీం ఇండియాకు మరింత బూస్ట్ ఇచ్చే అంశం. ఇక, ఇటీవలే ఆసియా కప్‌ లో కూడా పాక్‌ ను చిత్తు చేసింది రోహిత్‌ సేన. ఆ రకంగ చూస్తే... ఆత్మవిశ్వాసంతోనే, పాజిటివ్ వైబ్రేషన్స్ తోనే రోహిత్ సేన మైదానంలోకి అడుగుపెట్టబోతోంది!

అలా అని లెక్కలు, ఘణాంకాలు, చరిత్ర పుస్తకాలు అన్నీ మైదానంలోకి దిగేవారకే అనేది అత్యంత ముఖ్యమైన విషయం. ఇక ఈసారి పాక్‌ జట్టులో కొందరు ప్రమాదకర ఆటగాళ్లున్న మాట వాస్తవం. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఆ జట్టు కూడా వరుసగా రెండు మ్యాచ్‌ లు గెలిచింది. నెదర్లాండ్ పై గెలిచిన సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా శ్రీలంకపై రికార్డు లక్ష్యాన్ని ఛేస్ చేసిన విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. ప్రస్తుతం బాబర్‌ సేన ఆ కాన్ ఫిడెన్స్ తో ఈ మ్యాచ్‌ లో అడుగు పెడుతోంది.

ఈసారి పాన్ ఇండియా స్టార్ ఎవరు?

ప్రపంచంలో ఏ ఇతర జట్టుపై బెస్ట్ ఫెర్మార్మెన్స్ చూపించినా అదంతా ఒకెత్తు, పాకిస్థాన్ పై చూపించిన ఫెర్మార్మెన్స్ మరొకెత్తు. ఈ మ్యాచ్ లో తీసే ప్రతీ పరుగు, వేసే ప్రతీ బాలుపై కోట్ల కళ్లు ఎన్నో ఆశలతో, అతృతతో చూస్తుంటాయి. ఈ మ్యాచ్‌ లను భారత అభిమానులు ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ ఒక్క మ్యాచ్‌ లో జట్టును గెలిపిస్తే ఆ ఆటగాడు నిమిషాల వ్యవధిలో పాన్ ఇండియా హీరో అయిపోతాడు.

ఇలా గతంలో పాకిస్థాన్ పై 1992, 2003, 2011లో సచిన్‌ ఆడిన ఇన్నింగ్స్‌ లు చరిత్ర పుటల్లో నిలిచిపోగా... 1996, 1999లో వెంకటేశ్‌ ప్రసాద్‌ అద్భుత బౌలింగ్‌ అదే స్థాయిలో నిలిచిపోయింది.. నాడు ప్రసాద్ వేసిన బాల్స్ ఇప్పటికీ పలువురు పాక్ సీనియర్లు ప్రస్థావిస్తారంటే అతిశయోక్తి కాదు.

ఇక 2015లో కోహ్లి సెంచరీ(107)ని.. 2019లో రోహిత్‌ భారీ శతకం (140)ని అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దీంతో... ఈ మ్యాచ్ లో ఎవరు పాన్ ఇండియా స్టార్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి బ్యాటింగ్‌ లో కోహ్లి, రోహిత్‌, రాహుల్‌ లు సూపర్ ఫాం లో ఉన్నట్లు కనిపిస్తుండగా... బౌలింగ్ విభాగంగలో కుల్‌ దీప్‌, బుమ్రాలపై జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది.

కుల్ దీప్ కు ఇప్పటివరకూ పాక్ పై 5 వన్డే లు ఆడిన అనుభవం ఉంది. పాకిస్థాన్‌ పై అతడు ఆడిన 5 వన్డేల్లో 10 వికెట్లు తీగయా... 5/25 బెస్ట్ ఫెర్మార్మెన్స్. ఈసారి స్పిన్ కి అనుకూలించే పిచ్ అనే కామెంట్లు వస్తోన్న నేపథ్యంలో... ఈసారి కూడా కుల్ దీప్ మణికట్టు ఎలాంటి మాయ చేస్తాదనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే!