మెడికల్ రిపోర్ట్ లీక్.. ఆమె (అతడు) సంచలన నిర్ణయం
పారిస్ ఒలింపిక్స్ లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన అంశాల్లో ఒకటి అల్జీరియాకు చెందిన బాక్సర్ వ్యవహారమే.
By: Tupaki Desk | 7 Nov 2024 6:31 AM GMTపారిస్ ఒలింపిక్స్ లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన అంశాల్లో ఒకటి అల్జీరియాకు చెందిన బాక్సర్ వ్యవహారమే. ఈ దేశానికి చెందిన బాక్సర్ ఇమానె ఖెలిఫ్ ఆమెనా? అతడా? అనే సందేహంతో పాటు విమర్శలూ వచ్చాయి. ఖెలిఫ్ ఏకంగా స్వర్ణం నెగ్గడంతో మరింత రచ్చ జరిగింది. తాజాగా ఖెలిఫ్ లింగ గుర్తింపు వైద్య నివేదిక బయటపడింది. ఆమె (అతడు) శరీరంలో అంతర్గంతగా వృషణాలు, ఎక్స్‌వై క్రోమోజోములు ఉన్నట్లు తేలింది.
పారిస్ లోని క్రెమ్లిన్ బికెట్రే ఆస్పత్రి, అల్జీరియాకు చెందిన మొహమ్మద్ లామినే ఆస్పత్రి వైద్యులు 2023 జూన్‌లో వెల్లడించిన ఇమానె నివేదిక ప్రకారం అంతర్గతంగా వృషణాలు ఉన్నా.. గర్భసంచి లేదు. ఎంఆర్‌ఐలో ఇతర జననాంగాలు మాత్రం ఉన్నాయి. దీంతో ఆమె పురుషుడని నిర్ధరణ అయినట్లుగా పోస్టులు పెట్టారు.
ఆగస్టులో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఖెలిఫ్ 66 కేజీల ప్రి క్వార్టర్స్‌లో 46 సెకన్లలోనే ఇటలీ బాక్సర్ ను ఓడించింది. ఈ బౌట్ లో ఇమానె పంచ్ లకు ఇటలీ బాక్సర్ కుప్పుకూలింది. ఇమానెలో ఇంత పవర్ కు కారణం ఆమె ‘అతడు’ అని.. పోటీల్లోకి ఎలా అనుమతించారంటూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపైనా విరుచుకుపడ్డారు. కాగా, నిరుడు ఢిల్లీలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లోనే లింగ వివాదం కారణంగా ఇమానెను ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ తప్పించింది. అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ మాత్రం పారిస్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది. ఇక ఫైనల్లో ఆమె చైనా బాక్సర్ యాంగ్ లియూను ఓడించి స్వర్ణం నెగ్గింది.
వైద్య నివేదిక లీక్ తో..
ఇమానె స్వర్ణం నెగ్గడం సంచలనంగా మారగా.. ఆమె వైద్య నివేదిక ఇటీవల బటయపడడం మరింత సంచలనంగా మారింది. పైగా దీనిని ఒలింపిక్స్ జరిగిన ఫ్రాన్స్ కు చెందిన జర్నలిస్టే బయటపెట్టాడు. ఇప్పుడు ఇమానె నుంచి బంగారు పతకాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అసలే భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కేవలం కొన్ని గ్రాముల అధిక బరువు కారణంగా పతకం కోల్పోయిన పారిస్ ఒలింపిక్స్ లో ఇమానె అంశం కూడా రగడకు దారితీస్తోంది. ‘అతడి’ నుంచి మెడల్ వెనక్కు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో ఇమానె కీలక నిర్ణయం తీసుకుందన చెబుతున్నారు.
మీడియాపై కోర్టుకు..
తనకు సంబంధించిన వైద్య నివేదికను బయటపెట్టిన ఫ్రెంచ్ మీడియాపై కోర్టుకు వెళ్లేందుకు ఇమానె నిర్ణయించిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిని తాము అర్థం చేసుకుంటున్నామని చెప్పింది. ఆమె పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతోందని.. దీనిపై తామేమీ స్పందించబోమని తెలిపింది. అయితే, వైద్య నివేదికలు వాస్తవమైనవా? కాదా? అని తెలియకుండానే వెల్లడించేసిన జర్నలిస్ట్ పై చర్యలు తీసుకుందని పేర్కొంది.