Begin typing your search above and press return to search.

టి20 ఆడుతూనే.. టెస్టు ప్రాక్టీస్ చేయండి..ఆటగాళ్లకు బీసీసీఐ అల్టిమేటం

ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 Feb 2025 9:30 PM GMT
టి20 ఆడుతూనే.. టెస్టు ప్రాక్టీస్ చేయండి..ఆటగాళ్లకు బీసీసీఐ అల్టిమేటం
X

2024 సంవత్సరం భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చేదుగా మిగిలిపోనుంది. ఎన్నడూ లేనివిధంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్.. ఆపై ఆస్ట్రేలియాలో 1-3 తేడాతో టెస్టు సిరీస్ ఓటమి.. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి ఔట్.. వీటికిమించి.. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిల ఫామ్ పై తీవ్ర విమర్శలు.. అసలు టెస్టులకు వీరిద్దరూ గుడ్ బై చెప్పాలన్న డిమాండ్లూ వచ్చాయి. సంప్రదాయ ఫార్మాట్ లో టీమ్ ఇండియా ప్రదర్శనతో జట్టును ప్రక్షాళన చేయాలని చాలామంది అభిమానులు పట్టుబట్టారు.

ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు నెలలకు పైగా సాగనుంది. మళ్లీ ఆ తర్వాత కొద్ది రోజులు మాత్రమే టీమ్ ఇండియా ఆటగాళ్లు ఖాళీగా ఉండనున్నారు. అనంతరం నేరుగా ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కోసం ఆ దేశానికి వెళ్లనున్నారు.

అంటే.. టీమ్ ఇండియా ఎప్పుడో జనవరి మొదటివారం తర్వాత జూన్ లో తిరిగి టెస్టు మ్యాచ్ ఆడనుంది అన్నమాట. మధ్యలో చాంపియన్స్ ట్రోఫీ, టి20లీగ్ తర్వాత నేరుగా టెస్టుల్లో అడుగుపెట్టనుంది.

అసలే ఇంగ్లండ్.. టెస్టుల్లోనూ బజ్ బాల్ అంటూ వీర బాదుడు బాదుతోంది. అలాంటి జట్టును ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఎదుర్కొనడం అంటే ఓటమిని ఆహ్వానించడమే.. అందుకని ఐపీఎల్ ఆడుతూనే టెస్టు క్రికెట్‌ కు కూడా ప్రాక్టీస్ చేయాలని బీసీసీఐ ఆటగాళ్లకు సూచించింది.

వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ తదుపరి సైకిల్ (2025-27) జూన్‌ లో ఇంగ్లండ్ సిరీస్ తోనే ప్రారంభం కానుంది. మరోవైపు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ లలో ఓటమితో ఆటగాళ్లకు బీసీసీఐ టెన్ కమాండ్ మెంట్స్ విధించిన సంగతి తెలిసిందే. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా ఖాళీ దొరికితే అందరూ రంజీల్లో ఆడాల్సిందేనని రూల్ పెట్టింది. దీంతో దశాబ్దం పైగా విరామం తర్వాత రోహిత్, విరాట్ కోహ్లి రంజీ ఆడారు.

ఇప్పుడు ఐపీఎల్ ఆడే సమయంలోనే క్రికెటర్లతో టెస్టు కూడా ప్రాక్టీస్ చేయించాలని చూస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 25 వరకు సాగనుంది. తర్వాత జూన్‌ లో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్‌. అందుకని ఐపీఎల్ సందర్భంగానే టెస్టు బంతి (రెడ్ బాల్‌)తో ప్రాక్టీస్ చేయించాలని బీసీసీఐ చూస్తోంది.

కాగా, ఐపీఎల్ ముగిశాక ఇంగ్లండ్ కౌంటీ మ్యాచ్‌ లు ఆడాలని కొందరు టీమ్ ఇండియా క్రికెటర్లు నిర్ణయించుకున్నారట. ముఖ్యంగా కోహ్లి దీనిపై సీరియస్ గా ఆలోచిస్తున్నాట.