Begin typing your search above and press return to search.

ప్చ్... భారత్ ఆశలు ఆవిరి చేసిన పాక్!

అవును.. న్యూజిలాండ్ పై పాకిస్థాన్ గెలిస్తే భారత్ కు సెమీఫైనల్ అవకాశాలు ఉంటాయని ఆశించారు.

By:  Tupaki Desk   |   15 Oct 2024 3:59 AM GMT
ప్చ్... భారత్  ఆశలు ఆవిరి చేసిన పాక్!
X

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. ఏదో ఒక అద్భుతం జరిగి మహిళల టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీఫైనల్ కు చేరుతుందని ఆశించిన టీమిండియా అభిమానులకు చేదువార్త తెరపైకి వచ్చింది. మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత్ కథ ముగిసింది. న్యూజిలాండ్ చేతిలో పాక్ చిత్తవ్వడంతో ఈ ఫలితం వచ్చింది!

అవును.. న్యూజిలాండ్ పై పాకిస్థాన్ గెలిస్తే భారత్ కు సెమీఫైనల్ అవకాశాలు ఉంటాయని ఆశించారు. అలా ఆశించిన భారత్ కు నిరాశే మిగిలింది. గ్రూప్-ఏ ఆఖరి లీగ్ మ్యాచ్ లో కివీస్ 54 పరుగుల తేడాతో పాక్ ను చిత్తు చేసి నాకౌట్ కు చేరింది. దీంతో... భారత్, పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ ను పాక్ బౌలర్లు 110/6కే కట్టడి చేశారు. దీంతో... పాక్ గెలుపుపై భారత్ అభిమానుల నుంచి కాస్త ఆశలు చిగురించినట్లు కనిపించింది పరిస్థితి! అయితే... పాకిస్థాన్ చేతులెత్తేసింది. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి పాకిస్థాన్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది.

వాస్తవానికి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సమయంలో భారత్ ఆశలు వదులుకుందనే చెప్పాలి. కివీస్ 6.2 ఓవర్లలో 41/0 స్థితిలో ఉంది. దీంతో... టీమిండియా అభిమానులు ఆశలు వదులుకున్నారు! అయితే అనూహ్యంగా పాక్ బౌలర్లు సమిష్టిగా రాణించి 110 పరుగులకే కివీస్ బ్యాటర్స్ ని కట్టడిచేశారు.

ఇలా కివీస్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో పాకిస్థాన్ తో పాటు భారత అభిమానుల్లోనూ ఆశలు చిగురించాయి. అయితే... కివీస్ బౌలర్లు ఆరంభం నుంచే విజృంభించి ఈ ఆశలపై భారీగా నీళ్లు చల్లారు. కివీస్ బౌలర్ల ధాటికి 56 పరుగులకే కుప్పకూలింది.

భారత్ ఆశలు ఆవిరనే సంగతి అలా ఉంచితే... 9.4 ఓవలకు 52/5 స్థితిలో ఉన్న పాక్.. మరో 4 పరుగులు తేడాతో మిగిలిన 5 వికెట్లూ కోల్పోవడం మాత్రం తీవ్ర విమర్శల పాలవుతుంది.