Begin typing your search above and press return to search.

0-3తో క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..

మొన్నటివరకు ఇదీ పరిస్థితి. కానీ, నెల రోజుల్లోపే అంతా తారుమారైంది. తీరా చూస్తే ఇప్పుడు ఫైనల్ చేరడం కష్టమేనని స్పష్టం అవుతోంది.

By:  Tupaki Desk   |   3 Nov 2024 10:45 AM GMT
0-3తో క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
X

వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్ షిప్ ఫైనల్.. జస్ట్ కొద్దిలో ప్రపంచ విజేతగా నిలిచే చాన్స్ మిస్.. మూడోసారి కూడా ఫైనల్ దిశగా ప్రయాణం.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్.. కచ్చితంగా ఫైనల్ చేరే అవకాశాలు.. మొన్నటివరకు ఇదీ పరిస్థితి. కానీ, నెల రోజుల్లోపే అంతా తారుమారైంది. తీరా చూస్తే ఇప్పుడు ఫైనల్ చేరడం కష్టమేనని స్పష్టం అవుతోంది.

టెస్టు చాంపియన్ కాలేదిక..

వన్డేలు, టి20లకు ప్రపంచ కప్ ఉన్నట్లే టెస్టులకూ ప్రపంచ చాంపియన్ హోదా ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ). 2020-21, 2022-23లో భారత్ ఫైనల్ కు చేరింది టీమ్ ఇండియా. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో, రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఇటీవలి వరకు.. మూడోసారి ఫైనల్ చేరడం ఖాయం అని భావించారు. స్వదేశంలో న్యూజిలాండ్‌ తో టెస్టు సిరీస్‌ లో 0-3తో ఓటమితో హ్యాట్రిక్ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలకు గండిపడ్డాయి.

1 నుంచి 2కు.. ఆ తర్వాత

ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ లో.. న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ముందు వరకు పాయింట్ల పట్టికలో భారత్ అగ్ర స్థానంలో ఉంది. ఇప్పుడు సిరీస్ కోల్పోవడంతో రెండో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 62.50 శాతంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు భారత్ 68 శాతంతో టాప్ లో ఉంది. అయితే, మూడుకు మూడు మ్యాచ్ లు అదీ స్వదేశంలో ఓడడంతో 10 శాతం పాయింట్లు నష్టపోయింది. 58.33 శాతంతో రెండోస్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ లో ఒక టెస్టు, న్యూజిలాండ్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక (55.56) మూడో స్థానానికి ఎగబాకింది. చిత్రం ఏమంటే.. లంక చేతిలో ఓడినప్పటికీ.. భారత్ ను భారత్ లో ఓడించిన న్యూజిలాండ్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుని (54.55 శాతం) నాలుగుకు చేరింది. దక్షిణాఫ్రికా (54.17) ఐదో స్థానంలో ఉంది.

ఐదుకు నాలుగు మ్యాచ్ లు గెలవాలి..

టీమ్ ఇండియా ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ లో ఆడాల్సినవి ఐదు టెస్టులు. వీటిలో నాలుగు కచ్చితంగా గెలవాలి. మరొకదానిని డ్రా చేసుకోవాలి. అయితే, ఈ ఐదు టెస్టులు జరగబోయేది ఆస్ట్రేలియాలో. వచ్చే ఐదు టెస్టుల్లో భారత్ ఒక్కదాంట్లో ఓడినా.. ఫైనల్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారడం ఖాయం.