10 సెకన్ల యాడ్.. రూ.50 లక్షలు.. అదీ ఇండియా-పాక్ మ్యాచ్ అంటే?
ఆస్ట్రేలియాలో జరిగిన గత టి20 ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ గుర్తుందా..? మెల్ బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 160 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా.
By: Tupaki Desk | 6 Jun 2024 9:33 AM GMTఆస్ట్రేలియాలో జరిగిన గత టి20 ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ గుర్తుందా..? మెల్ బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 160 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 2021 టి20 ప్రపంచ కప్ లో పాక్ చేతిలో ఓడిన పరాభవాన్ని మర్చిపోకముందే మరో ఓటమి ఖాయమా? అనే ఆందోళన నెలకొన్న వేళ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. మరీ ముఖ్యంగా 18 బంతుల్లో 48 పరుగులు అవసరమైన దశలో కోహ్లి కొట్టిన షాట్లు అద్భుతమనే చెప్పాలి. ఈ మ్యాచ్ ను వంద కోట్లమంది వీక్షించారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదే కాదు.. భారత్-పాక్ ఎక్కడ తలపడినా వ్యూయర్స్ కోట్లలోనే ఉంటారు. ఇక మళ్లీ టి20 ప్రపంచ కప్ వచ్చింది.
ఇందులో భాగంగా భారత్-పాక్ ఆదివారం న్యూయార్క్ లో తలపడనున్నాయి. ఈసారి కూడా హై ఓల్టేజ్ మ్యాచ్ తప్పదు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ టికెట్ ధర కనిష్ఠం రూ.లక్షన్నర నుంచి గరిష్ఠం రూ.50 లక్షలు పలికింది. ఈ మ్యాచ్ ను స్కై స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
90 శాతం యాడ్ స్పేస్ సేల్
అప్పటికే పది మ్యాచ్ లు జరిగినా.. వచ్చే ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్ తో గాని టి20 ప్రపంచ కప్ నకు మజా రాదు. అంతటి ఆదరణ ఉన్నుందునే ఇప్పటికే 90 శాతంపైగా టివీ, హెడ్ డీ టీవీ అడ్వర్టయిజ్ మెంట్ స్పేస్ అమ్ముడయింది. టీవీ, మొబైల్ యాడ్ స్పేస్ దాదాపు బుక్ అయిపోయింది.
టి20 ప్రపంచ కప్ అధికారిక బ్రాడ్ కాస్టర్లు డిస్నీ స్టార్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్. యాడ్ రేట్లపై ఇప్పటికే ఇవి నియంత్రణ పాటిస్తున్నా.. భారత్-పాక్ మ్యాచ్ 20 నుంచి 25 శాతం అధికంగానే పలుకుతోంది. 10 సెకన్ల అడ్వర్టయిజ్ మెంట్ ధర రూ.50 లక్షలకు చేరింది. ఇడి యాడ్ పరిశ్రమ ఊహించని పరిణామం కావడం గమనార్హం. కొన్ని బ్రాండ్ లైతే కేవలం భారత్-పాక్ మ్యాచ్ కే అడ్వర్టయిజ్ మెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.