పల్లెల్లోనూ క్రికెట్ ఫీవరే.. ఎంత లేటెస్ట్ అంటే!!
ఇక, ఇళ్లలో టీవీలు ఉన్నవారు కూడా స్క్రీన్స్‌పై వీక్షించేందుకు ఇష్టపడుతున్నారని.. మరికొందరు తెలిపారు
By: Tupaki Desk | 19 Nov 2023 6:23 AM GMTదేశాన్ని కుదిపేస్తున్న ప్రపంచ కప్ ఫైనల్ పోటీల ఫీవర్ ఇప్పుడు పల్లెలకు కూడా పాకింది. దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ క్రికెట్ వీక్షకుల సంఖ్య పెరిగినట్టు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. క్రికెట్ ప్రియులు, వారి అభిరుచులు అనే విషయంపై సాగిన ఈ సర్వేలో గ్రామీణ స్థాయిపై ప్రధానంగా ఫోకస్ పెంచారు. గతం లో టీవీ మాధ్యమాలు పెద్దగా గ్రామాల్లో లేకపోవడంతో క్రికెట్ విషయంపై పెద్దగా ఆలోచన ఉండేది కాదు.
అయితే.. ఇప్పుడు పల్లెల్లోనూ ఇంటర్నెట్ రావడం.. విస్తృతంగా టీవీలు అందుబాటులో ఉండడంతో పల్లెల్లోనూ ప్రజలు క్రికెట్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఐఐటీ గువాహటి-ఎంబీసీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమైన తర్వాత.. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పల్లె జనాభా కూడా క్రికెట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తేలింది.
''ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు పల్లెల్లోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద స్క్రీన్స్ గ్రామ పంచాయ తీ కార్యాలయాల వద్ద దర్శనమిచ్చాయి'' అని సర్వేలో పాల్గొన్న ఒకరిద్దరు చెప్పారు. మధ్యాహ్నం 1గంట కల్లా పనులు ముగించుకుని పల్లె వాసులు స్క్రీన్స్‌ముందు చేరిపోయే అవకాశం ఉందన్నారు. అంతేకాదు.. పనులు కూడా మానుకున్నారని తెలిపారు.
ఇక, ఇళ్లలో టీవీలు ఉన్నవారు కూడా స్క్రీన్స్‌పై వీక్షించేందుకు ఇష్టపడుతున్నారని.. మరికొందరు తెలిపారు. ముఖ్యంగ గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు.. అన్ని వర్గాల ప్రజలు టికెట్ల కోసం ప్రయత్నించినట్టు బీసీసీఐ ప్రకటన చేసింది. అయితే.. పోటీ కారణంగా అందరికీ అందించ లేకపోయినట్టు తెలిపింది. మొత్తానికి క్రికెట్ ఫీవర్ దేశాన్ని ఆవరించిందని పరిశీలకులు చెబుతున్నారు.