బీకేర్ ఫుల్... పసికూన అనుకుంటే ప్రమాదమే సుమా!
ప్రస్తుతం ఐపీఎల్ మూడ్ లోకి ఎంటరవుతున్నట్లు కనిపిస్తున్న టీం ఇండియా అఫ్గానిస్థాన్ తో టీ20 సిరీస్ కు సిద్ధమవుతుంది.
By: Tupaki Desk | 11 Jan 2024 4:42 AM GMTప్రస్తుతం ఐపీఎల్ మూడ్ లోకి ఎంటరవుతున్నట్లు కనిపిస్తున్న టీం ఇండియా అఫ్గానిస్థాన్ తో టీ20 సిరీస్ కు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా మూడు టీ20ల ఈ సిరీస్ లో తొలిమ్యాచ్ గురువారం జరగనుంది. అయితే ఇండియా వర్సెస్ ఆఫ్గానిస్తాన్ అంటే ఒకప్పుడు "ఏమి చూస్తాములే బాసూ – వార్ వన్ సైడ్" అనే మాటలు వినిపించేవి.. అయితే ఇప్పుడు "అంత ఈజీ కాదు - ఆఫ్గాన్స్ ఇక్కడ" అనే కామెంట్లు కనిపిస్తున్నాయి.
అవును... ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ లో ఆఫ్గానిస్తాన్ జట్టు ప్రదర్శన ఏ రేంజ్ లో ఉందనేది తెలిసిన సంగతే. ఊహించని రీతిలో శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ లకు షాకిచ్చింది! దీంతో ఇక టీ20లో కూడా ఇదే ఫాం కొనసాగించే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఫలితంగా... ఆఫ్గాన్ ని టీం ఇండియా ఓవర్ కాన్ ఫిడెన్స్ తో లైట్ తీసుకుంటే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదు!
వాస్తవానికి ఆఫ్గానిస్తాన్ ప్లేయర్స్ కి సొంతదేశంలో ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదని అంటారు! వారంతా ఎవరి ఉద్యోగాల నిమిత్తం వారు వేరు వేరు దేశాల్లో ఉంటారని.. ఏదైనా సిరీస్ స్టార్ట్ అవుతుందంటే కొన్ని రోజుల ముందు దుబాయ్ వంటి దేశాల్లోని గ్రౌండ్స్ లో కలిసి ప్రాక్టీస్ చేస్తుంటారని చెబుతుంటారు. అలాంటీ జట్టు తాజా ప్రపంచ కప్ లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించేసింది.
ఇందులో భాగంగా... డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, మాజీ ఛాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలు నమోదు చేసింది. ఇదే సమయంలో... ఆస్ట్రేలియాను సైతం భయపెట్టేసింది. దీంతో ఒకానొక దశలో ఆఫ్గానిస్తాన్ జట్టు సెమీస్ చేరేలా కనిపించింది కూడా. కానీ మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించే సరికి ఆ అద్భుతం వల్ల ఈ అద్భుతం జరగలేదు! కానీ... ఈ వన్డే ప్రపంచకప్ లో వారి పెర్ఫార్మెన్స్ వల్ల ఇకపై పసికూన అని అనడం మానేశారు!
వరల్డ్ కప్ లో చూపించిన పెర్ఫార్మెన్స్ ఉత్సాహంతోపాటు ఇటీవల యూఏఈతో జరిగిన టీ20 సిరీస్ ను 2-1తో సొంతం చేసుకున్న సరికొత్త జోరుమీద కూడా ఉంది. స్టార్స్ అని చెప్పుకునేవాళ్లు లేకపోయినా... నాణ్యమైన స్పిన్నర్లు, క్రమశిక్షణతో బౌలింగ్ చేసే పేసర్లు, ఉత్తమ టాప్ ఆర్డర్, డేంజరస్ టైల్ ఎండర్స్ తో నిండి ఉన్న ఆ జట్టు తెగించి ఆడే ప్రమాదం లేకపోలేదు! సో.. బీ కేర్ ఫుల్!
టీం ఇండియాలో మార్పులు!:
అఫ్గానిస్థాన్ తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఇషాన్ కిషన్, శ్రేయస్ కు చోటు దక్కలేదు. ఇదే సమయంలో... ఇంగ్లాండ్ తో అయిదు టెస్టుల సిరీస్ ను దృష్టిలో పెట్టుకుని ఈ టీ20 మ్యాచ్ ల నుంచి బుమ్రా, జడేజా, సిరాజ్ ను దూరం పెట్టాల్సి వచ్చినట్లు ద్రావిడ్ తెలిపారు. అదేవిధంగా వ్యక్తిగత కారణాల వల్ల తొలి టీ20లో కోహ్లి ఆడట్లేదని.. రెండు, మూడు మ్యాచ్ లలో అతను బరిలో దిగుతాడని ద్రవిడ్ పేర్కొన్నాడు.