Begin typing your search above and press return to search.

బీసీసీఐకే షాకిచ్చిన టీమ్ ఇండియా ఆటగాళ్లు.. ఇదే చివరి మ్యాచ్

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ప్రస్తుతం భారత్- బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ లో తలపడుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 Sep 2024 1:30 PM GMT
బీసీసీఐకే షాకిచ్చిన టీమ్ ఇండియా ఆటగాళ్లు.. ఇదే చివరి మ్యాచ్
X

ప్రపంచ క్రికెట్లో భారత క్రికెట్ బోర్డు అత్యంత ధనిక బోర్డే కాదు.. అత్యంత క్రమశిక్షణ కలిగినది కూడా. ఎంతటి క్రీడాకారుడైనా క్రమశిక్షణ మీరితే తప్పించేందు వెనుకాడదు. బోర్డుతో కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లు నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. సెలక్షన్ ప్రక్రియ నుంచి మీడియాతో మాట్లాడడం వరకు అన్నీ రూల్స్ పాటించాల్సిందే. అలాంటి క్రికెట్ బోర్డుకు ఆటగాళ్లు ఝలక్ ఇచ్చారు.

ఇదే మైదానం..?

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ప్రస్తుతం భారత్- బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ లో తలపడుతున్నాయి. రెండో టెస్టు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌ గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. కానీ, కాన్పూర్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైంది. వాస్తవానికి ప్రమాణాలకు తగినట్లు లేకపోవడంతో కాన్పూర్‌ లో ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ స్టేడియంలో ఆధునిక సౌకర్యాలు లేవు. బీసీసీఐ కూడా ఇదే భావిస్తోంది. దీనికితగ్గట్లే పరిస్థితి ఉంది. తొలి రోజు వచ్చిన నివేదికలను పరిశీలిస్తే టీమ్ ఇండియాలోని కీలక ఆటగాళ్లు గ్రీన్ పార్క్ మైదానంలో ఆడేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

లక్నోలో ఆడతామన్నారా?

కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంపై భారత జట్టు మేనేజ్‌మెంట్ తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సౌకర్యాలు మెరుగ్గా లేనందును లక్నోలో ఆడాలని భావించారట. అయితే, రొటేషన్ ప్రకారం ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ టెస్టు మ్యాచ్ నిర్వహణకు కాన్పూర్ ను ఎంచుకుంది. కాగా, కాన్పూర్‌ లోని గ్రీన్ పార్క్ స్టేడియానికి గొప్ప చరిత్ర ఉంది. 1952లోనే ఇక్కడ భారత జట్టు తొలి టెస్టు ఆడింది. మొత్తం 40 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 24 టెస్ట్ మ్యాచ్‌ లు ఉన్నాయి. ఏడుగు గెలిచి.. మూడు ఓడిపోయింది. 14 వన్డేల్లో 10 గెలిచి.. 4 ఓడింది. ఒకే టి20 ఆడింది. అందులో పరాజయం పాలైంది.

ఇదే చివరిది?

కాన్పూర్ కాకుండా.. లక్నోలో ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయీ స్టేడియంలో మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆధునిక స్టేడియం నిర్మిస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో కాన్పూర్‌ లో భారత్-బంగ్లాదేశ్ టెస్టు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.