Begin typing your search above and press return to search.

బాదుడే బాదుడు... టీంఇండియా పేరున మరో సరికొత్త రికార్డ్!

ఇందులో భాగంగా ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సికర్స్లు (215) కొట్టిన జట్టుగా టీం ఇండియా ఘనత సాధించింది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 7:50 AM GMT
బాదుడే బాదుడు... టీంఇండియా  పేరున మరో సరికొత్త రికార్డ్!
X

తాజాగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ లో టీం ఇండియా దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఆడిన 9 మ్యాచ్ లలోనూ గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విషయాలలోనూ తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతుంది. అదృష్టానికి అవకాశం లేకుండా కేవలం కష్టంతోనే గెలిచి నిలిచింది. ఇదే సమయంలో సిక్స్ ల విషయంలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది.

అవును... వన్డే ప్రపంచకప్‌ లో టీం ఇండియా ఘనంగా సెమీస్‌ కు చేరింది. లీగ్‌ స్టేజ్‌ లో ఒక్క ఓటమీ లేకుండా చరిత్ర సృష్టించింది. ఇందులో భాగంగా... ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ లో నెదర్లాండ్స్‌ ను 160 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత భారత్ 410/4 భారీ స్కోరు చేయగా.. అనంతరం నెదర్లాండ్స్‌ 250 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా బ్యాటర్స్ కొట్టిన సిక్స్ ల మోతతో ఈ విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇందులో భాగంగా ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సికర్స్లు (215) కొట్టిన జట్టుగా టీం ఇండియా ఘనత సాధించింది. ఈ క్రమంలో 2019లో వెస్టిండీస్ (209) రికార్డును బద్దలు కొట్టింది. ఈ రెండు జట్ల అనంతరం 2023లో సౌతాఫ్రికా (203), 2015లో న్యూజిలాండ్ (179), ఈ ఏడాదిలోనే ఆస్ట్రేలియా (165) లు ఉన్నాయి. అయితే ఈ ఏడాది టీం ఇండియాకు మరిన్ని వన్డేలు ఉండటంతో ఈ రికార్డ్ ఎక్కడికి చేరుతుందనేది వేచి చూడాలి.

ఇదే క్రమంలో... తాజా మ్యాచ్ తో వన్డేల్లో రోహిత్ 55వ అర్ధశతకం పూర్తి చేసుకోవడంతోపాటు... ఈ ఇన్నింగ్స్‌ తో ఇంటర్నేషనల్ క్రికెట్‌ లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే సంవత్సరంలో అత్యధిక సిక్స్‌ లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. 2015లో ఏబీ డివిలియర్స్‌ 58 సిక్స్‌ లు కొట్టగా.. ఈ ఏడాది రోహిత్ 60 సిక్స్‌ లతో ఆ రికార్డును అధిగమించాడు. ఈ ఈ వరల్డ్‌ కప్‌ లోనే 24 సిక్స్‌ లు బాదాడు.

ఇదే సమయంలో వన్డేల్లో ఓపెనర్‌ గా 14వేల పరుగుల మైలురాయిని రోహిత్ శర్మ చేరుకున్నాడు. భారత్‌ తరఫున ఈ రికార్డును సాధించిన మూడో బ్యాటర్‌ గా అవతరించాడు. ఈ జాబితాలో భారత్‌ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ 16,119 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. సచిన్‌ 15,335 రన్స్‌ తో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇదే సమయంలో వరల్డ్‌ కప్‌ మ్యాచుల్లో అత్యధికంగా 50ప్లస్ స్కోరు చేసిన మూడో బ్యాటర్‌ గా కూడా రోహిత్ శర్మ రికార్డ్ సృష్టించాడు. ఈ లిస్ట్ లో సచిన్‌ 44 ఇన్నింగ్స్‌ ల్లో 21సార్లు 50 ప్లస్ స్కో ర్ చేసి టాప్ ప్లేస్ లో ఉండగా.. విరాట్ కోహ్లీ 35 ఇన్నింగ్స్‌ ల్లో 14 సార్లు, రోహిత్ 26 ఇన్నింగ్స్‌ల్లో 13 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌ లో 100 హాఫ్‌ సెంచరీలను పూర్తి చేయడం మరో అద్భుతం!