Begin typing your search above and press return to search.

వరల్డ్ కప్‌ లో ఇండియన్ టాప్ బౌలర్స్ వీరే!

ఈ సందర్భంగా... టీమిండియా ప్రపంచ కప్ లు గెలిచిన సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకుందాం..!

By:  Tupaki Desk   |   2 Oct 2023 11:30 PM GMT
వరల్డ్  కప్‌  లో  ఇండియన్  టాప్  బౌలర్స్  వీరే!
X

అక్టోబర్ 5.. మరో రెండు మూడు రోజుల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం మొదలవనుంది. ఈసారి ఈ సంగ్రామానికి భారత్ వేదికగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆల్ మోస్ట్ అన్ని దేశాలూ భారత్ కు చేరుకుని నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో మరికొన్ని దేశాల క్రికెటర్లు భారత్ లో వంటలు, వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఆ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ సందర్భంగా... టీమిండియా ప్రపంచ కప్ లు గెలిచిన సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకుందాం..! కపిల్ దేవ్ కెప్టెన్ గా 1983లో తొలిసారిగా టీమిండియా ప్రపంచకప్‌ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. నాటి నుంచి ఇండియాలో క్రికెట్ అంటే కపిల్ దేవ్.. కపిల్ దేవ్ అంటే క్రికెట్ అనేస్థాయిలో చర్చ నడించింది. అందుకే తర్వాత ఎంతమంది స్టార్స్ వచ్చినా కపిల్ ఆల్ వేస్ స్పెషల్ అని అంటారు.

అవును... కపిల్ దేవ్ ఎప్పటికీ స్పెషలే. ఈ రోజు అంతస్థులు పెరిగాయికదా అని పునాదులు మరిచిపోకూడదు కదా! ఆ తర్వాత ఎం.ఎస్. ధోని సారథ్యంలో 2011లో టీం ఇండియా రెండోసారి ప్రపంచ కప్‌ టైటిల్ గెలిచింది. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ కప్ - 2023 ప్రారంభమవబోతోంది. దీంతో... ఇప్పుడు రోహిత్ శర్మ సారధ్యంలో ఉన్న భారత్ జట్టు మూడోసారి ప్రపంచకప్ గెలవాలని కసితో ఉంది.

ఈ క్రమంలో మ్యాచ్ గెలవాలంటే బ్యాట్స్ మెన్ ల ఫెర్మార్మెన్స్ ఎంతో.. బౌలర్ ల ఫెర్మాన్స్ మరింత ముఖ్యమని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో... ప్రపంచకప్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. పైగా... ఈసారి టీం ఇండియాలో బ్యాట్స్ మెన్స్ కంటే బౌలర్స్ మరింత ఫాం లో ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వరల్డ్ కప్ లో బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇండియన్ బౌలర్స్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసి బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చిన బౌలర్స్ జాబితాలో జహీర్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. తన కెరీర్ లో 23 ప్రపంచకప్ మ్యాచ్‌ లు ఆడిన జహీర్.. 44 వికెట్లు తీశాడు. అనంతరం, ఈ జాబితాలో జవగల్ శ్రీనాథ్ రెండో స్థానంలో ఉన్నాడు. 34 మ్యాచ్‌ ల్లో 44 మంది ఆటగాళ్లను ఔట్ చేశాడు శ్రీనాథ్. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉన్నాడు.

భారత్ తరఫున 11 ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన మహ్మద్ షమీ.. మొత్తం 31 వికెట్లు తీశాడు. ఈ విధంగా భారత్ తరఫున ప్రపంచకప్ మ్యాచ్‌ లలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-3 బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్, మహ్మద్ షమీ ఉన్నారు. ఆ తర్వాత ఈ జాబితాలో ఇండియన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఉండగా.. భారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్ 5 లో ఉన్నారు.