Begin typing your search above and press return to search.

"సూపర్" శుభారంభం... గంభీర్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన టీమిండియా!

అవును... టీమిండియా నూతన మెయిన్ కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సిరీస్ శ్రీలంకతో జరిగింది.

By:  Tupaki Desk   |   31 July 2024 4:26 AM GMT
సూపర్ శుభారంభం... గంభీర్  కు బిగ్  రిలీఫ్  ఇచ్చిన టీమిండియా!
X

రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన కోచింగ్ లో టీమిండియా జట్టు అన్ని ఫార్మేట్లలోనూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఇక టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ కు టీ20 వరల్డ్ కప్ విక్టరీతో అద్భుతమైన వీడ్కోలు దక్కింది. ఈ సమయంలో... గౌతం గంభీర్ కు భారత క్రికెట్ హెడ్ కోచ్ గా బాధ్యతలు దక్కాయి. ఈ క్రమంలో... గంభీర్ కు సూపర్ శుభారంభం ఇచ్చింది టీమిండియా!

అవును... టీమిండియా నూతన మెయిన్ కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి సిరీస్ శ్రీలంకతో జరిగింది. ఓ పక్క అనుభవం లేని జట్టుతో టీ20 సిరీస్ అనే కామెంట్లు వినిపించాయి. ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో కోచ్ గా గంభీర్ కు తొలి సిరీస్ లోనే ఇంతటి కఠిన పరీక్ష ఎదురైందనే మాటలు ధ్వనించాయి.

అయితే... ఆ సందేహాలను, కామెంట్లనూ పటాపంచలు చేస్తూ... టీ20 సిరీస్ ని క్లీన్ స్వీప్ చేశారు భారత్ కుర్రాళ్లు! ఆటగాడిగా, మెంటార్ గా బలమైన నేపథ్యం కలిగి ఉన్న గంభీర్ పై ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ హోదాలో ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ జై షా ఎక్స్ లో గంభీర్ కు, టీమిండియా కుర్రాళ్లకూ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో... ఈ విక్టరీ గంభీర్ కు కోచ్ గా బిగ్ రిలీఫ్ అని అంటున్నారు నిపుణులు!

ఇక నిన్నరాత్రి శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో తీవ్ర ఉత్కంటత నెలకొంది. ఈ మ్యాచ్ లో భారత్ కు సూపర్ ఓవర్ లో విక్టరీ దక్కడం గమనార్హం. ఈ సందర్భంగా సూర్య కెప్టెన్సీకి అభినందనలు వెళ్లివెత్తుతున్నాయి. ఏమాత్రం ఒత్తిడి గురవ్వకుండా అతడు చేసిన పెర్ఫార్మెన్స్ అద్భుతః అంటున్నారు అభిమానులు.. క్రికెట్ పండితులు!

తాజాగా శ్రీలంకతో జరిగిన మూడోటీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 137 పరుగులే చేసింది. ఇక ఛేజింగ్ లో శ్రీలంక దూకుడు ప్రదర్శించింది.. 15 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసింది. అయినప్పటికీ భారత్ పట్టు వదలలేదు.. స్వయంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ చేసి మరీ భారత్ ను గెలిపించాడు!

ఇలా ఛేజింగ్ లో చివరి ఐదు ఓవర్లలో లంక కేవలం 30 పరుగులే చేయాలి.. ఇంకా 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఈ సమయంలోనే భారత్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతం చేసింది. 16వ ఓవర్లో బిష్ణోయ్... కుశాల్ మెండిస్ వికెట్ తీసుకున్నాడు. తర్వాత ఓవర్ లో సుందర్ వరుస బంతుల్లో హసరంగ, అసలంకలను ఔట్ చేశాడు. దీంతో లంకపై అనూహ్యంగా ఒత్తిడి పెరిగింది.

అయితే 18వ ఓవర్లో ఖలీల్ దారళంగా పరుగులు ఇవ్వడంతో 2 ఓవర్లలో శ్రీలంకకు 9 పరుగులు రావాల్సి ఉంది. ఈ సమయంలో రింకుకు బంతి ఇచ్చాడు సూర్య. అతడు 3 పరుగులు మాత్రమే ఇచ్చి కుశాల్ పెరీరా, రమేష్ లను ఔట్ చేశాడు. ఇక చివరి ఓవర్లో లంక విజయానికి 6 పరుగులు అవసరం. ఈ సమయంలో అనూహ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ తీసుకున్నాడు.

ఈ ఓవర్లో 2, 3 బంతులకు కమిందు, తీక్షణలను పెవిలియన్ కు పంపాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో... మ్యాచ్ టై అయ్యింది.. సూపర్ ఓవర్ మొదలైంది. ఈ సమయంలో సుందర్ సూపర్ ఓవర్లో రెండు పరుగులకే రెండు వికెట్లు తీయడం.. అనంతరం బ్యాట్ అందుకున్న సూర్య ఫస్ట్ బాల్ కే ఫోర్ కొట్టడంతో టీమిండియాకు సూపర్ విక్టరీ దక్కింది!