Begin typing your search above and press return to search.

టాప్ 10 రిచ్చెస్ట్ క్రికెటర్స్ ఇన్ ఇండియా... లిస్ట్ ఇదిగో!

ఇండియాలో అత్యంత ఇష్టపడే క్రీడ క్రికెట్ అనే సంగతి తెలిసిందే. ఇంకా గట్టిగా చెప్పాలంటే... ఇక్కడ క్రికెట్ అనేది ఆటకాదు

By:  Tupaki Desk   |   22 April 2024 5:30 PM GMT
టాప్ 10 రిచ్చెస్ట్ క్రికెటర్స్ ఇన్ ఇండియా... లిస్ట్ ఇదిగో!
X

ఇండియాలో అత్యంత ఇష్టపడే క్రీడ క్రికెట్ అనే సంగతి తెలిసిందే. ఇంకా గట్టిగా చెప్పాలంటే... ఇక్కడ క్రికెట్ అనేది ఆటకాదు.. అదో రిలీజియన్ అని చెప్పినా అతిశయోక్తి కాదు. దీంతో... ఇక్కడ మైదానంలోనే కాదు, మైదానం వెలుపలా ఇక్కడ క్రికెటర్స్ అంతా ఎంతో ఆరాధించబడుతుంటారు. ఇలా ఇక్కడ క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా మాత్రమే కాకుండా... అత్యధికంగా సంపాదనకు సహకరించే క్రీడగా కూడా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో... భారత్ లోని టాప్ 10 ధనవంతులైన క్రికెటర్ల గురించి చూద్దాం.

సచిన్ టెండూల్కర్:

ఇండియాలోనే కాదు.. ప్రపంచ క్రికెట్ అభిమానులకు సచిన్ గురించిన పరిచయం ఏమాత్రం అవసరం లేదు. క్రికెట్‌ లోని అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్! 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడే కాకుండా... మరెన్నో రికార్డులు అతని పేరు మీద టన్నుల కొద్దీ ఉన్నాయి. ఈ సమయంలో 150 మిలియన్ డాలర్లతో ఇండియాలోని టాప్ 10 రిచ్చెస్ట్ క్రికెటర్స్ లో సచిన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.

మహేంద్ర సింగ్ ధోని:

ఇండియాలోని అత్యంత పెద్ద ఫ్యాన్ బెల్ట్ ఉన్న క్రికెటర్స్ లో ధోనీ కచ్చితంగా టాప్ లో ఉంటారనే చెప్పాలి. వయసులతో సంబంధం లేకుండా... ఇతనికంటూ ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బెల్ట్ ఉంటుంది. 2007లో ఐసీసీ వరల్డ్ ట్వంటీ20, 2011లో ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్, 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ... ఇలా అన్ని ప్రధాన ఐసీసీ టోర్నమెంట్‌ లలో టీం ఇండియాని విజయపథంలో నడిపించిన కెప్టెన్ కూల్.. ఈ ధోనీ! ఈ సమయంలో ధోనీ.. 110 మిలియన్ డాలర్ల సంపదతో రెండవ అత్యంత సంపన్న భారతీయ క్రికెటర్‌ గా నిలిచాడు.

విరాట్ కోహ్లీ:

ఈ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నిస్సందేహంగా ప్రస్తుతం ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌ మెన్. అతని స్థిరమైన ప్రదర్శనం ప్రధానంగా లక్ష్యాలను ఛేజ్ చేయగల సామర్థ్యం అతనికి "చేజ్ మాస్టర్" అనే బిరుదును సంపాదించిపెట్టాయి. వన్డే ఇంటర్నేషనల్స్‌ లో అత్యంత వేగంగా 8,000.. 9,000.. 10,000.. 11,000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ సమయంలో 93 మిలియన్ డాలర్ల సంపదతో మూడో రిచ్చెస్ట్ ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.

సౌరవ్ గంగూలీ:

దాదా అని పిలువబడే సౌరవ్ గంగూలీ భారత జట్టు మాజీ కెప్టెన్. అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ జట్టును పోటీ శక్తిగా మార్చడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అతను 2008లో క్రికెట్‌ లోని అన్ని ఫార్మాట్‌ ల నుండి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్‌ గా క్రీడలో కొనసాగుతున్నాడు. ఈ సమయంలో 50 మిలియన్ డాలర్ల నికర విలువతో అత్యంత ధనవంతులైన ఇండియన్ క్రికెటర్స్ లిస్ట్ లో నాలుగో ప్లేస్ లో ఉన్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్:

వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడు బ్యాటింగ్ శైలికి ప్రసిద్ధి చెందిన టీం ఇండియా మాజీ క్రికెటర్. క్రికెట్ చరిత్రలో అత్యంత విధ్వంసక ఓపెనింగ్ బ్యాట్స్‌ మెన్‌ లలో వీరు ఒకడు. బ్యాట్ పట్టి క్రీజ్ లోకి అడుగుపెట్టడమే ఆలస్యం... టెస్ట్, వన్డే, టీ20 అనే తారతమ్యాలేవీ లేకుండా ఒకటే బాదుడు అతని శైలి. దూకుడే అస్త్రంగా ఉన్న సెహ్వాగ్ 2015లో క్రికెట్‌ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు. ఈ సమయంలో 45 మిలియన్ డాలర్లతో రిచ్చెస్ట్ ఇండియన్స్ లిస్ట్ లో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇక ఈ తర్వాత జాబితాలో వరుసగా..

యువరాజ్ సింగ్ - 35 మిలియన్ డాలర్లు

సురేష్ రైనా - 25 మిలియన్ డాలర్లు

రాహుల్ ద్రవిడ్ - 23 మిలియన్ డాలర్లు

రోహిత్ శర్మ - 22 మిలియన్ డాలర్లు

గౌతమ్ గంభీర్ - 19 మిలియన్ డాలర్లతో 6 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.