Begin typing your search above and press return to search.

ఆసియా కప్ - 2023... భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ డేట్ ఫిక్స్!

ఆసియా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ రిలీజ్ అయింది.

By:  Tupaki Desk   |   7 Aug 2023 1:58 PM GMT
ఆసియా కప్ - 2023... భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ డేట్ ఫిక్స్!
X

ఆసియా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ రిలీజ్ అయింది. ఇదే సమయంలో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ పై మరింత ఉత్కంట నెలకొంది. పైగా నిన్నమొన్నటివరకూ ఆసియా కప్ లో ఆడేవిషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంశయం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరింత చర్చనీయాంశమైంది.

అవును... తాజాగా పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్న ఆసియా కప్ - 2023 షెడ్యూల్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో... సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ఆసియా కప్ - 2023 ఆగష్టు 30న పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ తో ఆరంభం కానుంది. అనంతరం... సెప్టెంబర్ 2న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఇక ఆసియా కప్ - 2023లోని అన్ని మ్యాచ్‌ లు మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం అవుతాయి.

నిజానికి ఆసియా కప్‌ 2023 కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. అయితే పాక్‌ లో పర్యటించేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తటస్థ వేదికపై మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్ లో మొత్తం 13 మ్యాచ్‌ లు ఉన్నాయి. ఈ 13 మ్యాచ్‌ లకు పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఈ 13 మ్యాచ్ లలోనూ నాలుగు మ్యాచ్ లూ పాకిస్థాన్ లో జరగనుండగా... 9 మ్యాచ్‌ లు శ్రీలంకలో జరగనున్నాయి. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌, నేపాల్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.

అయితే అయితే ఈ షెడ్యూల్‌ ను అటు పీసీబీ కానీ.. ఇటు ఏసీసీ కానీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ... ఆసియా కప్ 2023 వన్డే టోర్నీకి అధికారిక బ్రాడ్‌ కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ ఈ షెడ్యూల్‌ ను రిలీజ్ చేసినట్టు ఓ క్రికెట్ అనలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా... ఈ నెల 30న ఆసియా కప్ ప్రారంభమవుతుందనే విషయాన్ని తెలియజేస్తూ.. స్టార్ స్పోర్ట్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్టర్‌ ను పంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షెడ్యూల్‌ ను కూడా రిలీజ్ చేసిందంటే.. దాదాపుగా ఇదే ఫైనల్ అని అంటున్నారు విశ్లేషకులు!