Begin typing your search above and press return to search.

ప్రపంచకప్.. భారత్-పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్.. వేదిక అదే

అందులోనూ భారత్-పాక్ మ్యాచ్ కు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఖరారు చేశారు.

By:  Tupaki Desk   |   26 July 2023 10:08 AM GMT
ప్రపంచకప్.. భారత్-పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్.. వేదిక అదే
X

భారత్ – పాక్ మ్యాచ్ జరిగేది అహ్మదాబాద్ లో. పాకిస్థాన్ పొరుగునుండే రాష్ట్రమే ఇది. అందులోనూ ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఉన్న స్టేడియంలో జరగనుంది. దీనికి దసరా సంబురాలు అడ్డువస్తున్నాయి. దీంతో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా ఇదే సొంత రాష్ట్రం. అంతేగాక అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. ఏ మాత్రం తేడావచ్చినా పెద్ద వివాదమే రేగుతుంది. అందుకే పటిష్ఠ కార్యాచరణతో వెళ్లేందుకు ఆలోచిస్తున్నారు.

వన్డే ప్రపంచ కప్ మరెంతో దూరంలో లేదు. కేవలం రెండున్నర నెలలే. అందులోనూ ఈసారి ఆతిథ్యం భారత్ ది. దీంతోపాటే తొలి మ్యాచ్ (ఇంగ్లండ్ – న్యూజిలాండ్) వేదిక గుజరాత్ రాజధాని అహ్మదాబాద్. ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

కాగా.. ఎప్పుడు ప్రపంచ కప్ జరిగినా.. అది టి20 ప్రపంచ కప్ అయినా వన్డే ప్రపంచ కప్ అయినా. అయితే, ఈసారి వన్డే ప్రపంచ కప్ నకు పాకిస్థాన్ హాజరు సందేహంగా మారింది. దీనిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తినా.. పాక్ రాక ఖాయమైంది. అందులోనూ భారత్-పాక్ మ్యాచ్ కు అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఖరారు చేశారు.

అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ కప్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌ - పాక్‌ మ్యాచ్ అక్టోబరు 15న జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్ లో హోటల్ గదులు బుక్ అయిపోయాయి. దీంతో ఆస్పత్రి గదులనూ బుక్ చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌ ను రీ షెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. భద్రత పరంగానే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

దసరా ముంగిట..

ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో ప్రపంచ కప్ జరుగనుంది. ఇది దసరా-దీపావళి సీజన్ కూడా. దసరా నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 15 నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ – పాక్ మ్యాచ్‌ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు తెలిపింది. వివిధ అవకాశాలను చర్చిస్తున్నట్లు చెప్పింది. త్వరలోనే నిర్ణయం కూడా తీసుకోనుంది.

రేపు సమావేశం..భారత్‌, పాక్‌ మ్యాచ్ ప్రతిష్ఠాత్మకం. భారీగా అభిమానులు తరలివస్తారు. అయితే నవరాత్రి ఉత్సవాలు, మ్యాచ్‌తో పర్యవేక్షణ భారంగా మారుతుందని భద్రతా సంస్థలు పేర్కొన్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రపంచ కప్‌ మ్యాచ్‌ లు నిర్వహించే రాష్ట్ర సంఘాలు గురువారం ఢిల్లీలో సమావేశం అవనున్నాయి. ఇక్కడే భారత్-పాక్ మ్యాచ్ కొత్త తేదీని నిర్ణయించే వీలుంది. మ్యాచ్‌ ను ఒక్క రోజు ముందుకు అంటే.. అక్టోబరు 14కు మార్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ కప్‌ మ్యాచ్ లు అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు జరగనున్నాయి.