Begin typing your search above and press return to search.

ఐపీఎల్ రిటెన్షన్... అరడజను ఇంట్రస్టింగ్ విషయాలు!

నవంబర్ రెండు లేదా మూడో వారంలో జరగనున్న మెగా వేలం నిర్వహణకు ముందు ఐపీఎల్ - 2025 రిటెన్షన్ జాబితా విడుదలైంది.

By:  Tupaki Desk   |   1 Nov 2024 4:21 AM GMT
ఐపీఎల్  రిటెన్షన్... అరడజను ఇంట్రస్టింగ్  విషయాలు!
X

నవంబర్ రెండు లేదా మూడో వారంలో జరగనున్న మెగా వేలం నిర్వహణకు ముందు ఐపీఎల్ - 2025 రిటెన్షన్ జాబితా విడుదలైంది. ఈ సమయంలో... ఇంతకాలం ఉన్న ఉత్కంఠకు తెరపడుతూ ఏ ఫ్రాంచైజీ ఎవరిని అట్టిపెట్టుకుంది.. ఏ ఆటగాడు వేలంలో పాల్గొనబోతున్నాడు అనే విషయాలపై స్పష్టత వచ్చింది. ఈ సమయంలో కొన్ని టాప్ ఇంట్రస్టింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును... ఐపీఎల్ - 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. ఈ విషయంలో పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. కెప్టెన్లను కూడా కొన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితాలో ప్రకటించకపోవడం ఆసక్తిగా మారింది. ఇలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దామ్..!

కెప్టెన్ రిషభ్ పంత్ వేలంలోకి:!

ఢిల్లీ ఫ్రాంచైజీ కెప్టెన్ రిషభ్ పంత్ ను రిటెన్షన్ లిస్ట్ లో ప్రకటించలేదు. రిటెన్షన్ కోసం పంత్ - ఫ్రాంచైజీ మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో అతడు మెగా వేలంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోపక్క చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పంత్ కు టచ్ లో ఉన్నాయని అంటున్నారు.

ఇందులో భాగంగా సీఎస్కే ఫ్రాంచైజీ... మహేంద్ర సింగ్ ధోనీ వారసత్వ ప్రణాళికను ప్లాన్ చేస్తున్న క్రమంలో.. పంత్ వైపు చూస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ కూడా పంత్ వైపు చూస్తున్నాయని అంటున్నారు.

ఒకే సీజన్ లో ఐదుగురు కెప్టెన్ల తొలగింపు!:

ఐపీఎల్ వేలం చరిత్రలో గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో సుమరు ఔదుగురు కెప్టెన్లను తొలగించారు! శిఖర్ ధావన్, ఫాఫ్ డుప్లెసిస్, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయాస్ అయ్యార్ లు తమ ప్రమేయం ఉండో.. లేకో కానీ.. తమ కెప్టెన్ పాత్రలకు దూరమయ్యారు!

ఢిల్లీలో రిషభ్ పంత్ తో పాటు.. టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరిన తర్వాత రెండుసార్లు తొలగించబడిన శ్రేయస్ అయ్యర్ పై ఈ నిర్ణయం చాలా కఠినమైనదని అంటున్నారు. ఇక కేఎల్ రాహుల్ ను లక్నో వదులుకోవడం ఒకెత్తు అయితే... ఆ ఫ్రాంచైజీ సీఈవో గోయెంకా చేసిన ప్రకటన మరొకెత్తు.

ఇందులో భాగంగా... జట్టును వారి వ్యక్తిగత లక్ష్యాలు, వ్యక్తిగత ఆకాంక్షల కంటే ముందు గెలవాలనే మనస్తత్వం ఉన్న ఆటగాళ్లతో కలిసి వెళ్లడం మంచి ఆలోచన! అని వ్యాఖ్యానించిన పరిస్థితి!

ముంబై ఇండియన్స్ లో బూమ్రాకు పెద్ద పీట!:

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా ఎట్టకేలకు తన సత్తా చాటాడనే చెప్పాలి. ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు బూమ్రా (రూ.18 కోట్లు) టాప్ రిటెన్షన్ గా నిలిచాదు. బూమ్రా తర్వాత జాబితాలో సూర్యకుమార్ (రూ.16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు), రోహిత్ శర్మ (రూ.16 కోట్లు) ఉన్నారు.

ద్రావిడ్ వచ్చిన వేళ రాజస్థాన్ కీలక నిర్ణయం:

రాహుల్ ద్రావిడ్ తిరిగి రావడంతో.. రాజస్థాన్ ఫ్రాంచైజీ తమ భారత కోర్ పై నమ్మకం ఉంచింది. ఇందులో భాగంగా... మొత్తం 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవాలని నిర్ణయించింది. వీరిలో... ఈ జాబితాలో ఇటీవల సూపర్ సెంచరీ చేసిన సంజూ శాంసన్ (రూ.18 కోట్లు), సూపర్ ఫాం లో ఉన్న యశస్వీ జైస్వాల్ (రూ.18 కోట్లు) తో పాటు రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్ మయర్, సందీప్ శర్మలను అట్టిపెట్టుకుంది.

విరాట్ పై ఆర్సీబీ చెక్కుచెదరని నమ్మకం!:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ కెప్టెన్ డూప్లెసిస్ ను విడుదల చేయడానికి ఎంచుకున్న వేళ.. విరాట్ కొహ్లీ విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. ముగ్గురితో ఉన్న ఆర్సీబీ రిటెన్షన్ లిస్ట్ లో విరాట్ కొహ్లీ రూ.21 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇతనితో పాటు.. రజిత్ పాటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాల్ (రూ.5 కోట్లు) ఉన్నారు.

అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ధోనీ:

ఐపీఎల్ 2025కి సంబంధించిన చర్చల్లో ధోనీ వ్యవహారం ఒకటనే సంగతి తెలిసిందే. అన్ క్యాప్డ్ ఇంటర్నేషనల్స్ అనే ప్రక్రియ వచ్చిందే ధోనీ కోసం అనే చర్చా తెర్పైకి వచ్చింది! ఈ సమయంలో చెన్నై నుంచి ఏకైక అన్ క్యాప్డ్ రిటెన్షన్ గా ధోనీ ఉన్నాడు. ధోనీ ఎల్లో రంగు దుస్తుల్లో మరికొన్నాళ్లు ఆడటం అభిమానులకు అత్యంత ఇష్టమైన అంశం! ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్.. ధోనీని రూ.4 కోట్లకు రిటెన్షన్ చేసుకొంది.