Begin typing your search above and press return to search.

టీమిండియా బాల్ ట్యాంపరింగ్ చేసింది.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణ

పాకిస్థాన్ గ్రేట్ బ్యాట్స్ మెన్ లలో ఒకడు మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్. భారీకాయుడైన అతడు మైదానంలో చాలా కూల్ గా ఉండేవాడు.

By:  Tupaki Desk   |   26 Jun 2024 10:14 AM GMT
టీమిండియా బాల్ ట్యాంపరింగ్ చేసింది.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణ
X

తమ జట్టు కనీసం సూపర్-8కు చేరలేదనే ఆక్రోశమో.. భారత్ వంటి చిరకాల ప్రత్యర్థి అజేయంగా సెమీస్ కు వెళ్లిందనే అక్కసో.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అనవసర వ్యాఖ్యలతో వివాదం రేపుతున్నాడు. క్రికెట్ కెరీర్ లో చాలా కూల్ పర్సన్ గా పేరున్న అతడు.. జెంటిల్మన్ గేమ్ లో ఎప్పుడూ జెంటిల్మన్ టీమ్ గా ఆడే భారత్ పై కడుపు మంట చూపుతున్నాడు. పాక్ కు చెందిన మరే ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తారని ఊహించవచ్చేమో కానీ.. అతడు మాట్లాడాడు అంటేనే ఆశ్చర్యపోవాల్సి వస్తోంది.

ఇంజీ.. ఇదేనా ఇంగితం?

పాకిస్థాన్ గ్రేట్ బ్యాట్స్ మెన్ లలో ఒకడు మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్. భారీకాయుడైన అతడు మైదానంలో చాలా కూల్ గా ఉండేవాడు. ఈ విషయాన్ని భారత మాజీలు కూడా చెబుతారు. అలాంటివాడు.. ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్ లో భారత్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందంటూ ఆరోపణలు చేశాడు. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా ఆస్ట్రేలియాను భారత్ దాదాపు ఇంటికి పంపిన సంగతి తెలిసిందే. మరోవైపు బంగ్లాదేశ్ ను అఫ్ఘానిస్థాన్ ఓడించడంతో ఆసీస్ కు అవకాశమే లేకపోయింది. అయితే, ఇంజమామ్ మాత్రం.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత పేసర్ అర్షదీప్ సింగ్ 16వ ఓవర్లో కొత్త బంతిని రివర్స్ స్వింగ్ చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. దీన్నిబట్టి 12 లేదా 13వ ఓవర్ లోనే బంతి రివర్స్ స్వింగ్ కు అనుకూలంగా మారిందా? అని ప్రశ్నించాడు. మ‌రీ ముందుగానే బాల్‌ రివ‌ర్స్ స్వింగ్ అయ్యింద‌న్నాడు. అంపైర్లు కళ్లు మూసుకున్నారంటూ నిందించాడు.

మరి నీ మేనల్లుడి మాటేమిటి?

ఇంజమామ్ గొప్ప బ్యాటరే అయినా.. పాకిస్థాన్ క్రికెట్ లో అతడు శుద్ధపూసేమీ కాదు. మేనల్లుడు ఇమాముల్ హక్ ను చీఫ్ సెలక్టర్ గా ఉన్నప్పుడు జాతీయ జట్టుకు ఎంపిక చేశాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే, ఇమాముల్ కొంత రాణించడంతో అవి సద్దుమణిగాయి. మొత్తానికి ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేటర్ గానే ఇంజమామ్ చరిత్రలో నిలిచిపోయాడు.