Begin typing your search above and press return to search.

ఐపీఎల్ వేలంలో వీళ్లంతా నక్కతోక తొక్కారా?

అవును... గత వేలంలో రూ.24.75 కోట్లు పలికిన ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ మిచెల్ స్టార్క్ ఈసారి సగానికంటే తక్కువకు పడిపోయాడు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 3:51 AM GMT
ఐపీఎల్  వేలంలో వీళ్లంతా నక్కతోక తొక్కారా?
X

సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24 ఆదివారం జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం తొలిరోజు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా గత సీజన్ లో భారీ ధర పలికినవారు ఇప్పుడు సగానికి పైగా ధరకు పడిపోగా.. గతంలో స్వల్ప ధరలు పలికినవారు ఇప్పుడు రికార్డ్ స్థాయి ధరలకు అమ్ముడయ్యారు.

వీరిలో ఇంకొంతమందికి ఉన్నంతలో న్యాయం జరిగిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతుండగా.. మరికొంతమందికి మాత్రం నక్క తోక తొక్కినట్లుగా భారీ ధరలు పలికాయని చెబుతున్నారు. ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్నవి మిచెల్ స్టార్క్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యార్, చాహల్, సిరాజ్ ల పేర్లు వినిపిస్తున్నాయి!

అవును... గత వేలంలో రూ.24.75 కోట్లు పలికిన ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ మిచెల్ స్టార్క్ ఈసారి సగానికంటే తక్కువకు పడిపోయాడు. ఇందులో భాగంగా మిచెల్ స్టార్క్ ను కోల్ కతా నైట్ రైడర్స్ రిటెయిన్ చేసుకోకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు దక్కించుకుంది. ఇదే సమయంలో గత వేలంలో రూ.17 కోట్లు పలికిన కేఎల్ రాహుల్ ఈ సారి 14 కోట్లే పలికాడు.

ఇందులో భాగంగా... ఈ వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ ను ఢిల్లీ క్యపిటల్స్ దక్కించుకుంది. వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ పంత్ రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఈ వేలంలో పేస్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ జాక్ పాట్ కొట్టాడనే చెప్పాలి. అతన్ని రిటయిన్ చేసుకోని కోల్ కతా వేలంలో అనూహ్య ధరకు తిరిగి సొంతం చేసుకుంది.

ఇందులో భగంగా... గత సీజన్ లో రూ.8 కోట్లు పొందిన అతను.. ఇప్పుడు ఏకంగా రూ.23.75 కోట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇక.. తొలిరోజు మొదట వేలానికి వచ్చిన ఫేసర్ అర్షదీప్ సింగ్ కు మంచి ధర లభించింది. ఇందులో భాగంగా అతన్ని పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు తిరిగి సొంతం చేసుకుంది.

ఇదే సమయంలో చాలా మంది ఊహించని విధంగా చాహల్ ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అదేవిధంగా... వికెట్ కీపర్ జితేశ్ శర్మ ను బెంగళూరు రు.11 కోట్లకు దక్కించుకోగా.. ఫేసర్ నటరాజన్ ను ఢిల్లీ రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. ఇవి రెండూ అంచనాలకు మించిన ధరలే అని అంటున్నారు.

ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు రూ.9.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది. పేసర్ మహ్మద్ సిరాజ్ ను రూ.12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకోగా.. మహ్మద్ షమీ (రూ.10 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు) కు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.

ఇక విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తె... జోస్ బట్లర్ (గుజరాత్ - రూ.15.75 కోట్లు), ఆర్చర్ (రాజస్థాన్ - రూ.12.50 కోట్లు), బౌల్ట్ (ముంబై - రూ.12.50 కోట్లు), హేజిల్ వుడ్ (బెంగళూరు - రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (బెంగళూరు - రూ.11.50 కోట్లు), స్టాయినిస్ (పంజాబ్ - రూ.11 కోట్లు), రబాడా (గుజరత్ - రూ.1.75 కోట్లు) పలికారు.