బ్రాండ్ లో తగ్గేదేలే... ఐపీఎల్ టీమ్స్ వేల్యూలు ఎంత పెరిగాయంటే..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమై.. క్రికెట్ రంగంలోనే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద లీగ్ గా హవా నడిపిస్తోంది.
By: Tupaki Desk | 6 Dec 2024 4:46 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రేజ్, పాపులారిటీ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా తన పరిధిని ఆర్థికంగా మరింతగా విస్తరించుకుంటోంది. క్యాష్ రిచ్ లీగ్ ఆవిర్భవించి 16 ఏళ్లు గడుస్తున్నా.. ఆదరణ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ ల బ్రాండ్ వేల్యూ విపరీతంగా పెరిగింది.
అవును... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమై.. క్రికెట్ రంగంలోనే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద లీగ్ గా హవా నడిపిస్తోంది. ఈ సమయంలో బ్రాండ్ విలువను ఏ ఏటికాఏడు భారీగా పెంచుకుంటుంది. ఇందులో భాగంగా 2023లో 10.7 బిలియన్ డాలర్ల నుంచి 13% పెరుగుదల నమోదు చేస్తూ 2024లో 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్స్ బ్రాండ్ వాల్యూ 100 మిలియన్ డాలర్లను దాటింది. ఈ బ్రాండ్ వాల్యూ విషయంలో అన్ని జట్ల కంటే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) టాప్ లో నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచాయి.
ఇందులో భాగంగా... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వేల్యూ 52 శాతం పెరిగి 122 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1,033 కోట్లు) కు చేరుకుంది. ఆ తర్వాత స్థానంలో ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ టీమ్ బ్రాండ్ వాల్యూ 36% పెరిగి 119 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,007) కు చేరుకుంది. ఆ తర్వాత స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది.
ఇందులో భాగంగా ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ 67% మేర పెరిగి 117 మిలియన్ డాలర్లు (సుమారు రూ.990 కోట్లు) కు రీచ్ అవ్వగా... గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బ్రాండ్ వేల్యూ 38 శాతం పెరిగి 109 మిలియన్ డాలర్లు (సుమారు రూ.922 కోట్లు) కు చేరింది.
ఇక ప్రధానంగా తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్.ఆర్.హెచ్) బ్రాండ్ వాల్యూ ఏకంగా 76 శాతం పెరగి 85 మిలియన్ డాలర్లు (సుమారు రూ.719 కోట్లు) కు చేరింది. ఇక మిగిలిన స్థానాల్లో.. రాజస్థాన్ రాయల్స్ ($81 మిలియన్లు), ఢిల్లీ కేపిటల్స్ ($80 మిలియన్స్), గుజరాత్ టైటాన్స్ ($69 మిలియన్లు), పంజాబ్ కింగ్స్ ($68 మిలియన్లు), లక్నో సూపర్ జైంట్స్ ($60 మిలియన్లు) గా ఉన్నాయి.