Begin typing your search above and press return to search.

ఐపీఎల్ మెగా వేలం ముహూర్తం.. ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా ఇదే

ఈ ఏడాది మెగా వేలంలో ఫ్రాంచైజీలు ఎందరిని రిటైన్ చేసుకోవచ్చు అనేదానిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చింది బీసీసీఐ.

By:  Tupaki Desk   |   18 Oct 2024 7:30 PM GMT
ఐపీఎల్ మెగా వేలం ముహూర్తం.. ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా ఇదే
X

ఒక ఏడాది మినీ వేలం.. మరో ఏడాది మెగా వేలం.. ఇదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విధానం.. నిరుడు మినీ వేలం జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా క్రికెటర్లు, పేసర్లు మిచెల్ స్టార్క (రూ.25 కోట్లు), కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ (రూ.20 కోట్లు) సొమ్ములు చేసుకున్నారు. మరి ఇప్పుడు మెగా వేలం ముంగిట ఏం జరగనుంది అనే ఆసక్తి కలుగుతోంది. ఎందుకంటే.. నిరుటి కంటే ఈ ఏడాది క్రికెటర్లకు అత్యధిక ధర పలికే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

రిటైనింగ్ రూల్స్

ఈ ఏడాది మెగా వేలంలో ఫ్రాంచైజీలు ఎందరిని రిటైన్ చేసుకోవచ్చు అనేదానిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చింది బీసీసీఐ. ఇక మెగా వేలం వచ్చే నెలలో జరగనుంది. ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఆప్షన్ కూడా ఇందులో ఉంది. అయితే, ఏ ప్రాంచైజీ ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని మెగా వేలానికి వదిలేస్తుంది? అనేదానిపై చిక్కుముడులు వీడుతున్నాయి.

సమయం లేదు మిత్రమా?

తామ ఎవరిని రిటైన్ చేసుకుంటుందన్నదీ ఫ్రాంచైజీలు ఈ నెల 31లోగా బీసీసీఐకి తెలియజేయాలి. అంటే మరొక రెండు వారాల సమయం కూడా లేదు. అందుకనే ఫ్రాంచైజీలు కసరత్తును ముమ్మరం చేశాయి. ఈలోగానే రిటెన్షన్ల జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో 10 ఫ్రాంచైజీలకు చెందిన రిటెన్షన్ ఆటగాళ్ల పేర్లున్నాయి.

ఫ్రాంచైజీల వారీగా రిటెన్షన్ వీరినే

ముంబై ఇండియన్స్: రోహిత్, బుమ్రా, సూర్యతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

చెన్నై సూపర్ కింగ్స్: జడేజా, రుతురాజ్, దూబే, ధోనీ

కోల్ కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్

ఢిల్లీ క్యాపిటల్స్: రిషభ్ పంత్, అక్సర్ పటేల్, జేక్ ఫ్రేజర్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్

పంజాబ్ కింగ్స్ అర్షదీప్.

లక్నో సూపర్ జెయింట్స్ : నికొలస్ పూరన్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మోహిసిన్ ఖాన్

గుజరాత్ టైటాన్స్: శుబ్ మన్ గిల్, రషీద్ ఖాన్

సన్ రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ, క్లాసెన్

రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మొహమ్మద్ సిరాజ్.