Begin typing your search above and press return to search.

'దొంగ ఆటగాళ్ల'పై ఐపీఎల్ బ్యాన్.. ఫ్రాంచైజీల పట్టు.. ధోనీకి చెన్నై ఝలక్

ఇది జట్టు సమతూకాన్ని దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కఠిన నిర్ణయానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 11:26 AM GMT
దొంగ ఆటగాళ్లపై ఐపీఎల్ బ్యాన్.. ఫ్రాంచైజీల పట్టు.. ధోనీకి చెన్నై ఝలక్
X

నాలుగేళ్ల కిందట కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ 12 కోట్లకు పైగా వెచ్చింది ఓ మేటి పేసర్ ను వేలంలో కొనుక్కుంది. కానీ.. తీరా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతడు గాయంతో వైదొలగాడు. దీంతో కోల్ కతా జట్టు సమతూకం దెబ్బతిన్నది. దీంతో మ్యాచ్ లు గెలవలేకపోయింది. అయితే, ఆ ఆటగాడి గాయం నిజమైనదే. కానీ, ఇలాంటి సాకులు చూపుతూ చాలామంది ఆటగాళ్లు లీగ్ నుంచి వైదొలగుతున్నారు. ఇది జట్టు సమతూకాన్ని దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు కఠిన నిర్ణయానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

మినీ వేలమే.. సన్ రైజర్స్ మద్దతు ఐపీఎల్ లో ప్రస్తుతం 10 జట్లు ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే సీజన్ కు గాను మెగా వేలం నిర్వహించనున్నట్లు ఇప్పటిదాక కథనాలు వచ్చాయి. కానీ, ఫ్రాంచైజీలు మినీ వేలానికే పట్టుబడుతున్నాయి. బుధవారం ఐపీఎల్ పాలకమండలి సమావేశం కూడా దీనిపై ఏదీ తేల్చలేదు. మెగా వేలం, రిటెన్షన్‌, ఇంపాక్ట్‌ రూల్‌ మూడు అంశాలు ప్రధానంగా చర్చకు రాగా.. ఏమీ తేల్చలేదు. మరోసారి సమావేశం జరిగే చాన్సుంది. అయితే, ఈ ఏడాది చాంపియన్ అయిన కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ యజమాని షారుఖ్‌ ఖాన్ మెగా వేలం వద్దంటే వద్దంటున్నారట. షారుఖ్ వాదనకు సన్ రైజర్స్ కూడా మద్దతు పలికినట్లుగా చెబుతున్నారు.

షారుఖ్.. వాడియా వాడివేడి..మెగా వేలం వద్దంటున్న షారుఖ్‌ ఖాన్ తో పంజాబ్‌ కింగ్స్‌ యజమాని నెస్‌ వాడియా వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కోల్ కతా పటిష్ఠంగా ఉండడంతో మెగా వేలానికి వెళ్తే నష్టపోతామనేది షారుఖ్ అభిప్రాయం. కాగా, కనీసం రెగ్యులర్ కెప్టెన్ కూడా లేని పంజాబ్ మెగా వేలానికి పట్టుబడుతోంది. దీంతోపాటు రిటెన్షన్‌ లో ఎంతమందిని అట్టిపెట్టుకోవాలనేనా షారుఖ్, వాడియా మధ్య చర్చ జరిగింది. ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవాలనేది షారుఖ్ కోరిక అయితే.. అలా వద్దని వాడియా వాదించినట్లు సమాచారం. కాగా, 8 మందిని రిటైన్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించాలని.. విదేశీ ప్లేయర్లలో అదనంగా మరికొందరిని అట్టిపెట్టుకొనే అవకాశం ఇవ్వాలని సన్ రైజర్స్ కోరినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తమ మాజీ సారథి, దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీని రిటైన్ చేసుకునే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పెద్ద విశేషమే. మరోవైపు గత సీజన్ ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలగి రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.