సీఎస్ కే వర్సెస్ ఆర్సీబీ... ఎవరి బలమెంత?
ఐపీఎల్ సందడి వచ్చేసింది. ఈ సందడిలో భాగంగా తుదిపోరుకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలంజర్స్ బెంగళూర్ జట్లు సిద్ధంగా ఉన్నాయి
By: Tupaki Desk | 22 March 2024 11:45 AM GMTఐపీఎల్ సందడి వచ్చేసింది. ఈ సందడిలో భాగంగా తుదిపోరుకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలంజర్స్ బెంగళూర్ జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో తమకు అచ్చొచ్చిన చెపాక్ స్టేడియంలో శుభారంభం చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ ఉవ్విళ్లూరుతుండగా... ఇటీవల ఉమన్స్ ప్రీమియర్ లీగ్ కప్ ను ఆర్సీబీ జట్టు గెలవడంతో ఆ స్ఫూర్తితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బరిలోకి దిగనుంది. ఈ సమయంలో ఏవరి బలాబలాలేమిటనేది ఇప్పుడు చూద్దాం...!
అవును... భారీ అంచనాలతో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే ఈ సీజన్ లో తన తొలిమ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుండగా... ఈసారి కప్ తమదే అంటూ ఆర్సీబీ రంగంలోకి దిగనుంది. ఈ సమయంలో... సీఎస్ కే కొత్త సారధితో బరిలోకి దిగుతుండగా... డుప్లెసిస్ సారధ్యంలో ఆర్సీబీ ఎంటరవుతోంది. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాంటింగ్ బలం, ఆర్డర్ విషయన్ని ఒకసారి పరిశీలిద్దాం!
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ని ఆ టీం నూతన సారధి రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి, గత ఏడాది జరిగిన ప్రపంచకప్ లో అదరగొట్టిన కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్ర ఆరంభించే అవకాశం ఉంది. ఇదే క్రమంలో... అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, డారిల్ మిచెల్, మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజాతో కూడిన బ్యాటింగ్ లైనప్ సీఎస్కే కి బలంగానే ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే... మెయిన్ ఆలీ, జడేజాల రూపంలో స్పిన్ ఆల్ రౌండర్లు సిద్ధంగా ఉన్నారు.
ఇక ఆర్సీబీ విషయానికొస్తే... డుప్లెసిస్ నాయకత్వంలోని ఈ జట్టులో అతడితో పాటు స్టార్ బ్యాట్స్ మెన్స్ కింగ్ కొహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్ ల విశ్వరూపాలు మరోసారి చూసే అవకాశాలు లేకపోలేదు. ఇదే సమయంలో బెస్ట్ ఫినిషర్ గా పేరున్న దినేష్ కార్తీక్ గత సీజన్ లో ఆకట్టుకోకపోయినా.. ఈసారి మాత్రం సంతృప్తి పరుస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
ఇక బౌలింగ్ విభాగం విషయానికొస్తే... స్టార్ పేసర్ సిరాజ్ తోపాటు లాకీ ఫెర్గూసన్, కామెరూన్ గ్రీన్, యువ బౌలర్ ఆకాశ్ దీప్ తో పేస్ డిపార్ట్ మెంట్ బలంగా ఉంది. ఇదే సమయంలో... స్పిన్ బౌలింగ్ డిపార్ట్ మెంట్ విషయానికొస్తే... మ్యాక్స్ వెల్ పైనే కాస్త ఎక్కువగ భారం పడే అవకాశం లేకపోలేదు. కర్ణ్ శర్మ లెగ్ స్పిన్ కు ఇప్పుడు పెద్ద పరీక్షే ఉంది!
ఇక చెపాక్ పిచ్ విషయానికొస్తే... ఈ వేదిక సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటూనే.. స్పిన్నర్లకు సహకరిస్తుంటుంది. దీంతో... ఈ సమయంలో పూర్తిగా బ్యాటర్స్ పైనే ఆధారపడకుండా.. స్పిన్ అటాక్ ని నమ్ముకుని బరిలోకి దిగాలని అంటున్నారు.