Begin typing your search above and press return to search.

పుష్ప మేనరిజం : జడ్డూ అంటే పేరు కాదు.. బ్రాండ్.. వైరల్ వీడియో

చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని తన మ్యానరిజమ్స్‌తో మంత్రముగ్ధుల్ని చేశాడు.

By:  Tupaki Desk   |   11 March 2025 3:29 PM IST
పుష్ప మేనరిజం : జడ్డూ అంటే పేరు కాదు.. బ్రాండ్.. వైరల్ వీడియో
X

డైరెక్టర్ సుకుమార్ 'పుష్ప 2: ది రూల్' అనే టైటిల్ ప్రకటించినప్పటి నుండి, అల్లు అర్జున్ ప్రభావం దేశవ్యాప్తంగా విస్తరించింది. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని తన మ్యానరిజమ్స్‌తో మంత్రముగ్ధుల్ని చేశాడు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో, అల్లు అర్జున్ బ్రాండ్ ప్రభావం రాజమౌళి స్థాయిని దాటి మరింత ఎత్తుకు వెళ్లిందనే చెప్పాలి. ఈ సినిమాతో అతను సాధించిన క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ గెలుపు గురించి సోషల్ మీడియాలో ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత మనకు దక్కిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని జట్టంతా ఘనంగా సెలబ్రేట్ చేసింది. అయితే, ఈ సంబరాల్లో రవీంద్ర జడేజా చేసిన ఒక ప్రత్యేకమైన యాడ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

జడేజా మ్యాచ్ విజయం తర్వాత, పుష్ప సినిమా ఫేమస్ మ్యానరిజమ్స్‌ను అనుకరిస్తూ తనదైన శైలిలో స్టెప్పులేశారు. కోట్లాది మంది వీక్షిస్తున్న ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో మన తెలుగు హీరోకి సంబంధించిన ఒక మ్యానరిజం ప్రతిధ్వనించడమంటే చిన్న విషయం కాదు. అంతే కాదు, జడేజా తన IPL జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కీలక ఆటగాడు అనే విషయం తెలిసిందే. త్వరలోనే IPL 2025 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో జడేజా తనదైన స్టైల్‌లో 'పుష్ప 2'లోని జైలు సీన్‌ను స్పూఫ్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వీడియోలో అల్లు అర్జున్ ఫేమస్ డైలాగ్ 'పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండు' అనే వాక్యాన్ని మార్చి 'జడ్డు అంటే పేరు కాదు.. ఒక బ్రాండు' అంటూ తనదైన స్టైల్‌లో ప్రదర్శించాడు. ఈ స్టైల్ ప్రస్తుతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇది తొలిసారి కాదు.. జడేజా 'పుష్ప 1' విడుదలైన సమయంలో కూడా, అల్లు అర్జున్ గెటప్‌లో ఫోటో షూట్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పట్లో కూడా అది సంచలనంగా మారింది. ఈ దృశ్యాన్ని పరిశీలించిన వారంతా జడేజాకు 'పుష్ప' క్యారెక్టర్ ఎంతగా నచ్చిందో అర్థం చేసుకుంటున్నారు. కేవలం జడేజా మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ కూడా పుష్పలోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్‌ను గతంలో అనుసరించాడు.

మన తెలుగు హీరోకి సంబంధించిన స్టైల్ అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలో ప్రాచుర్యం పొందడం, క్రికెటర్స్ దాన్ని ఫాలో అవ్వడం, తెలుగు సినిమాల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అలాంటి ఘనత సాధించిన అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడెంత హాయ్ ఫీలవుతున్నారో ఊహించుకోవచ్చు!