Begin typing your search above and press return to search.

పాక్ క్రికెటర్ల ఎదుట జై శ్రీరాం నినాదాలు... రంగంలోకి ఉదయనిధి!

By:  Tupaki Desk   |   15 Oct 2023 1:50 PM GMT
పాక్ క్రికెటర్ల ఎదుట జై శ్రీరాం నినాదాలు... రంగంలోకి ఉదయనిధి!
X

డెంగ్యూ, దోమలు, మలేరియా, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదని.. వాటిని నిర్మూలించాలని.. అలానే మనం సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన.. సనాతన ధర్మం అనేది.. సామాజిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఇండియా - పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక విషయంపైనా ఆయన స్పందించారు.

అవును... ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. ఈ విధంగా ఇతర దేశాల క్రికెటర్ల సమక్షంలో అభిమానుల ప్రవర్తన ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో... క్రీడలు అనేవి దేశాల ఐకమత్యానికి ఉపయోగపడాలే తప్ప... ద్వేష వ్యాప్తికి సాధనంగా మారకూడదని తెలిపారు. దీంతో ఈ రియాక్షన్ వైరల్ గా మారింది.

శనివారం గుజరాత్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం సుమారు 1.10 లక్షల మంది ప్రేక్షకుల స్టేడియంలో ఉంటే.. వారిలో 90శాతానికి పైగా బ్లూ జెర్సీలు చేతపట్టినవారే అని అంటున్నారు. దీనిపై ఇప్పటికే పాక్ కోచ్ తన అక్కసు పెళ్లగక్కాడు.

ఈ సమయంలో... పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూంకు వస్తున్న క్రమంలో అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. వీటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారంపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.. తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

మరోపక్క ఈ వీడియోపై సోషల్ మీడియాలో అభిమానుల ప్రవర్తనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. ఇందులో భాగంగా... అభిమానుల ప్రవర్తన సరైంది కాదని కొంతమంది అంటుంటే... జై శ్రీరాం అని మరికొందరు కమెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో మరో పది రోజుల్లో చెన్నైలో పాక్‌ క్రీడాకారులు రెండు మ్యాచ్‌ లు అడటానికి వస్తారని.. వారందరిని గౌరవంగా స్వాగతించండి అని, ఇది సరైన భారతీయం అని అంటున్నారు!

కాగా... శనివారం మధ్యాహ్నం వరల్డ్ కప్ మ్యాచ్‌ లో పాకిస్థాన్‌ ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌ లోనే బాబార్ ఆజాంకు కోహ్లీ ఆరుదైన బహుమతి కూడా అందించాడు. తన సంతకం చేసిన జెర్సీని కానుకగా పంపించి సోదరభావాన్ని చాటుకున్నాడు. మరోపక్క రిజ్వాన్ డ్రెస్సింగ్ రూంకు వస్తున్న క్రమంలో కొంతమంది ప్రేక్షకులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు.