Begin typing your search above and press return to search.

బట్లర్‌ బైబై .. చాంపియన్స్‌ ట్రోఫీ తొలి వికెట్‌ ఔట్‌..

మెగా టోర్నీ పూర్తికాకముందే ఓ వికెట్‌ పడింది.. చాంపియన్స్‌ ట్రోఫీ వైఫల్యానికి ఓ కెప్టెన్‌ వికెట్‌ ఇచ్చేశాడు.

By:  Tupaki Desk   |   1 March 2025 9:03 AM IST
బట్లర్‌ బైబై .. చాంపియన్స్‌ ట్రోఫీ తొలి వికెట్‌ ఔట్‌..
X

మెగా టోర్నీ పూర్తికాకముందే ఓ వికెట్‌ పడింది.. చాంపియన్స్‌ ట్రోఫీ వైఫల్యానికి ఓ కెప్టెన్‌ వికెట్‌ ఇచ్చేశాడు. మంచిగానే ఆడినా లక్‌ కలసిరాకపోవడంతో జట్టు లీగ్‌ దశ నుంచే వెనుదిరగడం అతడికి చేటు చేసింది. ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ తన పదవికి

గుడ్‌బై చెప్పాడు. 2023లో భారత్‌ లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌తో పాటు ఇటీవలి భారత పర్యటనలో టి20, వన్డే సిరీస్‌ లు కోల‍్పోవడం, చాంపియన్స్‌ ట్రోఫీలోనూ వరుస పరాజయాల నేపథ్యంలో బట్లర్‌ కెప్టెన్సీ పగ్గాలను వదులుకున్నాడు.

2019లో సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ సాధించి పెట్టిన ఇయాన్‌ మోర్గాన్‌ నుంచి 2022 జూన్‌లో నాయకత్వ బాధ్యతలు అందుకున్న బట్లర్‌.. మొదట జట్టును బాగానే నడిపించాడు. 2022 టి20 ప్రపంచ కప్‌ కూడా అందించాడు. కానీ, రెండేళ్లుగా జట్టుకు టి20లు, వన్డేల్లో క్రమం తప్పకుండా ఓటములు ఎదురవుతున్నాయి. పూర్తిగా లీగ్‌ పద్ధతిలో భారత్‌ లో జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్‌ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గా బరిలో దిగిన ఇంగ్లండ్‌ ది ఘోరమైన ప్రదర్శన. 9 మ్యాచ్‌లకు గాను 3 మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంతో సరిపెట్టుకుంది.

ఇక 2024 టీ20 ప్రపంచ కప్‌ లోనూ ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ గా బరిలో దిగి సెమీస్‌ వరకు వచ్చింది. సెమీస్‌ లో భారత చేతిలో ఓడింది.

చాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 351 పరుగులు చేసినా ఓడిపోయింది. అఫ్ఘానిస్థాన్‌ పై 325 పరుగుల టార్గెట్‌ ఛేదనలో కొద్ది తేడాలో ఓడింది. దీంతో బ్యాడ్‌ లక్‌ వెంటాడింది. టోర్నీ నుంచి వెళ్లిపోయిఇంది. దీంతో నాయకత్వం నుంచి బట్లర్‌ తప్పుకొన్నాడు. ఇంగ్లండ్‌ వన్డే, టి20 కెప్టెన్‌ యువ బ్యాట్స్‌మన్‌ హ్యారీ బ్రూక్‌ను నియమిస్తారని తెలుస్తోంది. చాంపియన్స్‌ ట్రోఫీలో బ్రూక్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కాగా, శనివారం దక్షిణాఫ్రికాతో చాంపియన్స్‌ ట్రోఫీ చివరి లీగ్‌ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని బట్లర్‌ ప్రకటించాడు. జట్టులో కొనసాగుతానని స్పష్టం చేశాడు.

చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన ఇంగ్లండ్‌ జట్టులో సరైన బౌలింగ్‌ కూర్పు కనిపించలేదు. పేసర్‌ ఆర్చర్‌ మెరుగ్గానే రాణించినా మార్క్‌ ఉడ్‌ తేలిపోయాడు. మూడో పేసర్‌ గా ఆల్‌ రౌండర్‌ ఆట్కిన్సన్‌ ఆకట్టుకోలేదు.బ్యాటింగ్‌ లోనూ లివింగ్‌ స్టన్‌ వంటివారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌ ఇంటిదారి పట్టింది.

కొసమెరుపుః ఆతిథ్య పాకిస్థాన్‌ జట్టు చాంపియన్స్‌ ట్రోఫీలో దారుణ ప్రదర్శన చేసింద. ఒక్క గెలుపు కూడా లేకుండా వెనుదిరిగింది. ఆ జట్టు కెప్టెన్‌ రిజ్వాన్‌ రాజీనామా చేస్తాడనుకుంటే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బట్లర్‌ తప్పుకొన్నాడు.