కలర్ జిరాక్స్... క్రికెట్ రాని కొహ్లీని చూశారా?
అతడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు పొరబడి ఆటోగ్రాఫ్ లు అడుగుతున్నారంటే అతడేమీ సెలబ్రెటీ కాదు సుమా... యాజ్ టీజ్ గా విరాట్ కొహ్లీలా ఉంటాడు.
By: Tupaki Desk | 12 Oct 2023 3:56 AM GMTమనిషి పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటారు. అయితే అంందులో కొంత వాస్తవం ఉందని, మరికొంత చీకట్లో బాణం లాంటి ఇష్యూ అని అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే... ముఖ్యంగా సెలబ్రెటీలను పోలిన వ్యక్తులు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటారు. ఈ ఐడెంటిటీ దొరకగానే వారు కూడా మినీ సెలబ్రెటీ అయిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా క్రికెట్ రాని కొహ్లీ ఒకరు తాజాగా హల్ చల్ చేస్తున్నారు.
అవును... చండీగఢ్‌కు చెందిన ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కార్తీక్ శర్మ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాడు. అతడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు పొరబడి ఆటోగ్రాఫ్ లు అడుగుతున్నారంటే అతడేమీ సెలబ్రెటీ కాదు సుమా... యాజ్ టీజ్ గా విరాట్ కొహ్లీలా ఉంటాడు. విరాట్ మాదిరి శరీరం, అతడిలాగే గడ్డం, దాదాపు అదే హైటు, అదే నవ్వుతో సహా భారత క్రికెట్ స్టార్ ని దించేశాడు కార్తీక్.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... కార్తీక్ కు విరాట్ కు చాలా పోలికలే ఉన్నాయి. ముఖ కవలికలు కలవడం మాత్రమే కాదు... అతడి నడక, స్టైల్, స్మైల్ కూడా విరాట్ నే పోలి ఉంటుంది. దీంతో... అభిమానులు సడన్ గా చూడగానే షాకైపోతున్నారు.. తెలిసిన తర్వాత తేరిపారా చూసినా ఆశ్చర్యపడుతున్నారు.
అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో అతడికి ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. కార్తీక్ బయటకు వస్తే చాలు.. కోహ్లి వచ్చాడేమో అనుకుని వెంటపడుతున్నారట క్రికెట్ అభిమానులు. సెల్ఫీ కోసం వెంటపడుతున్నారు.. ఆటోగ్రాఫ్ కోసం అడుగుతున్నారు. అయితే... వాళ్లంతా దగ్గరకు రాగానే.. తాను కొహ్లీ కాదని చెప్పేస్తున్నాడంట.
ఇక్కడ గమనించల్సిన మరో విషయం ఏమిటంటే... ఏ ఆటతో అయితే విరాట్ కొహ్లీ ఈ స్థాయిలో ఫేమస్ అయ్యాడో.. ఆ క్రికెట్ కార్తీక్ కు రాదంట. అవును... కోహ్లిని పోలిన కార్తీక్ కు విరాట్ ఫేవరెట్ క్రికెటరే కానీ... క్రికెట్ రాదట! క్రీడలంటే ఇష్టమే కానీ ఏ క్రీడల్లోకి వెళ్లలేదట. అయితే కోహ్లి అంటే అతడికి చాలా ఇష్టం.
మైదానం బయట విరాట్ వ్యక్తిత్వానికి తాను ఫిదా అని చెప్పే కార్తీక్త్... తన వ్యక్తిగత జీవితంలో కోహ్లీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెబుతుంటాడు. ఇదే సమయంలో ఏదో ఒక రోజు తన క్రికెట్ హీరోని కలవాలనేది అతడి ఆశ అని చెబుతున్నాడు. అయితే ఇలా కోహ్లిని పోలిన ఈ కార్తీక్ గురించి తెలుసుకున్న కొన్ని సంస్థలు డాక్యుమెంటరీలు కూడా తీస్తున్నాయట. ఇందులో భాగంగా... "హ్యుమన్స్ ఆఫ్ బాంబే" పేరిట కార్తీక్ పై ఓ డాక్యుమెంటరీ నిర్మాణానికి సిద్ధమైందని తెలుస్తుంది.