Begin typing your search above and press return to search.

410 కోట్ల ఆస్తిప‌రురాలు.. మ్యాచ్ ఓడాక క‌న్నీళ్లు!

కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. గేమ్ ముగిసిన తర్వాత వ్యాపారవేత్త కావ్య మారన్ విజేత అయిన‌ జట్టుకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   27 May 2024 10:07 AM GMT
410 కోట్ల ఆస్తిప‌రురాలు.. మ్యాచ్ ఓడాక క‌న్నీళ్లు!
X

దేశంలోని క్రికెట్ ప్రేమికులందరికీ నిన్న చాలా ప్ర‌త్యేక‌మైన‌ రోజు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2024 విజేతగా నిలిచింది. షారూఖ్ ఖాన్ సహ యాజమాన్యంలోని త‌న జట్టును ఉత్సాహపరిచేందుకు బిజీగా ఉండగా, అమితాబ్ బచ్చన్ SRH యజమాని కావ్య గురించి మాట్లాడటానికి కొంత సమయం కేటాయించారు. తన జట్టు ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న మారన్ గురించి తన బ్లాగ్‌లో మెగాస్టార్ అమితాబ్ ఇలా రాసారు. ``ఐపీఎల్ ఫైనల్ ముగిసింది. KKR అత్యంత నమ్మకమైన విజయాన్ని సాధించింది. SRH చాలా విధాలుగా నిరుత్సాహపరిచింది.. ఎందుకంటే SRH ఒక మంచి జట్టు.. వారి అద్భుతమైన ప్రదర్శనలను చూశాం. వారు ఇతర మ్యాచ్‌లు ఆడిన రోజుల్లో..!! కానీ గమనించాల్సిన విష‌యం... చాలా హత్తుకునే అందమైన యువతి ... స్టేడియంలో ఉన్న SRH యజమాని..ఓటమి తర్వాత ఉద్వేగానికి లోనయ్యారు.. కన్నీళ్లు పెట్టుకున్నారు.. భావోద్వేగాన్ని ప్రదర్శించకుండా కెమెరాల నుండి ఆమె ముఖాన్ని వెన‌క్కి తిప్పారు. ... నేను ఆమె గురించి బాధపడ్డాను !! పర్వాలేదు.. రేపు మరో రోజు ఉంది.. నా ప్రియతమా!`` అని అమితాబ్ బచ్చన్ బ్లాగ్ లో రాసారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. గేమ్ ముగిసిన తర్వాత వ్యాపారవేత్త కావ్య మారన్ విజేత అయిన‌ జట్టుకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. కెమెరా నుండి తన కన్నీళ్లను దాచడానికి ఆమె ముఖం వెన‌క్కి తిప్పింది. ఒక అభిమాని పేజీ X (ట్విట్ట‌ర్‌)లో కావ్య ఎమోష‌న‌ల్ అయిన‌ వీడియోను షేర్ చేసారు. ``కావ్య మారన్ తన కన్నీళ్లను దాచిపెట్టింది... ఆమె ఇప్పటికీ KKRని మెచ్చుకుంది``అని రాసారు.

స‌న్ రైజ‌ర్స్ ఓట‌మికి ఎమోష‌న‌ల్ అయిన‌ కావ్య మారన్ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు. SRH లీగ్ దశలో మంచి ప్రదర్శన కనబరిచింది కానీ ప్లేఆఫ్స్ - ఫైనల్స్‌లో తడబడింది. ఆసక్తికరంగా ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల‌లోనూ హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత కావ్య చాలా కలత చెందారు. నాలుగేళ్ల క్రితం స‌న్ రైజ‌ర్స్ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్ర‌తి మ్యాచ్ లో కావ్య స్పంద‌న‌లు, ఎమోష‌న్స్ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. అంద‌మైన చిరునవ్వు ఈ యువ‌తికి `నేషనల్ క్రష్` అనే బిరుదును అంకిత‌మిచ్చింది. ఆస‌క్తిక‌రంగా దక్షిణాఫ్రికా 20 టోర్నమెంట్ (SA20)లో ఆడే క్రికెట్ ఫ్రాంచైజీ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ని కూడా కావ్య మారన్ సొంతమైంది. ఈస్టర్న్ కేప్ జట్టు 2022లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి రెండుసార్లు SA20 టైటిల్‌ను కైవసం చేసుకుంది. స‌న్ రైజ‌ర్స్ తో పోలిస్తే ఈస్ట‌ర్న్ కేప్ విజ‌యాలు కావ్య‌లో ఆనందం నింపాయి.

కావ్య‌లో ప్ర‌తిభ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కేవ‌లం క్రికెట్ ఫ్రాంఛైజీల నిర్వ‌హ‌ణ మాత్ర‌మే కాదు... స‌న్ గ్రూప్ కి చెందిన చాలా వ్యాపారాల‌లో కావ్య భాగ‌స్వామి. వాటి ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తిస్తున్నారు. వ్య‌వ‌స్థాప‌కులైన క‌ళానిధి మార‌న్ సార‌థ్యంలో స‌న్ గ్రూప్ 19000 కోట్ల నిక‌ర ఆస్తుల‌ను క‌లిగి ఉంది. కావ్య నిర‌క ఆస్తులు సుమారు 410కోట్లు అని తెలిసింది. ఓట‌మిని జీర్ణించుకోలేని దూకుడు కావ్య‌లో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.