Begin typing your search above and press return to search.

కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ... కోల్‌ కతా చేతిలో బెంగళూరు చిత్తు!

ఐపీఎల్ సీజన్ - 17లో భాగంగా 10వ మ్యాచ్ లో కోల్ కత నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగింది.

By:  Tupaki Desk   |   30 March 2024 3:52 AM GMT
కేకేఆర్  వర్సెస్  ఆర్సీబీ... కోల్‌  కతా చేతిలో బెంగళూరు చిత్తు!
X

ఐపీఎల్ సీజన్ - 17లో భాగంగా 10వ మ్యాచ్ లో కోల్ కత నైట్ రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది.. ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో... బెంగళూరు నుంచి ఓపెనర్లుగా కోహ్లీ, డూప్లెసిస్ మైదానంలో అడుగుపెట్టారు. ఇక ఆ తర్వాత మ్యాచ్ ఆధ్యాంతం ఎలా సాగిందనేది ఇప్పుడు చూద్దాం..!

రెండో ఓవర్లోనే తొలి వికెట్ డౌన్!:

మిచెల్ స్టార్క్ వేసిన ఫస్ట్ ఓవర్ లో కొహ్లీ ఒక ఫోర్ కొట్టడంతో 7 పరుగులు రాగా.. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్లో చివరి బంతికి బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్.. మిచెల్ స్టార్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో రెండు ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు ఒక వికెట్ నష్టానికి 17 పరుగులకు చేరింది.

బ్యాట్ ఝులిపించిన కొహ్లీ - గ్రీన్!:

డూప్లెసిస్ రూపంలో ప్రారంభంలోనే పెద్ద దెబ్బ తగిలినప్పటికీ... కొహ్లీ – గ్రీన్ లు దూకుడుగానే ఆడారు. ఇందులో భాగంగా... సునీల్ నరైన వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్ కొట్టిన గ్రీన్... వ్యక్తిగత స్కోరు 24కి చేరుకున్నాడు. దీంతో... పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు స్కోరు ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు.

బెంగళూరు రెండో వికెట్ డౌన్!:

ఫుల్ జోష్ లో సాగుతోన్న బెంగళూరుకు షాక్ తగిలింది. రస్సెల్ వేసిన 8.5 బంతికి భారీ సిక్స్ కొట్టిన గ్రీన్, ఆ తర్వాత బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ సమయానికి గ్రీన్ వ్యక్తిగత స్కోర్ 33 (21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులు. దీంతో... బెంగళూరు స్కోరు తొమ్మిది ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 82 పరుగులు.

36 బంతుల్లో కొహ్లీ హాఫ్ సెంచరీ:

ఈ సీజన్ లో కొహ్లీ మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో భాగంగా... 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 50 పరుగులు చేశాడు. పైగా వరుణ్ చక్రవర్తి వేసిన ఈ ఓవర్ లో ఒక సిక్స్, రెండు ఫోర్ల సాయంతో 17 పరుగులు రాబట్టడంతో... బెంగళూరు స్కోరు 12 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు!

మాక్స్ వెల్ ఔట్!:

ఈ సీజన్ లో మాక్స్ వెల్ మరోసారి తడబడ్డాడు! ఇందులో భాగంగా కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో 28 (19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులకు ఔటయ్యాడు. నరైన వేసిన 15 ఓవర్లో రింకూ సింగ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 15 ఓవర్లకు బెంగళూరు స్కోరు 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు.

రజత్‌ పటీదార్‌, అనూజ్ రావత్ ఔట్‌!

బెంగళూరు వరుస వికెట్లు కోల్పోతుంది. ఇందులో భాగంగా... రస్సెల్ వే సిన 17వ ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించిన పటేదార్.. రింకూ సింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటవ్వగా... 18 ఓవర్లో హర్షిత్ రాణా వేసిన బంతికి ఫిలిప్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అనూజ్ రావత్. ఔట్ అయ్యే సమయానికి వీరిద్దరి వ్యక్తిగత పరుగులు చెరో మూడు కాగా... 18 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 5 వికెట్ల నష్టానికి 153 పరుగులు.

బెంగళూరు బ్యాటింగ్ పూర్తి... కోల్ కత టార్గెట్ ఫిక్స్!:

కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్ల్లో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు రాబట్టింది. బెంగళూరు బ్యాటర్స్ లో కింగ్ కొహ్లీ... 83 (59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లు) పరుగులు చేశాడు. ఇక గ్రీన్ (33), మ్యాక్స్ వెల్ (28), కార్తీక్ (20) రాణించారు.

దూకుడుగా మొదలుపెట్టిన కోల్ కతా!:

బెంగళూరు నిర్దేశించిన 183 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా మొదటి ఓవర్లోనే మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా... సిరాజ్ వేసిన తొలి ఓవర్ లో 15 పరుగులు రాబట్టింది. వచ్చీ రాగానే బ్యాట్ ఝులిపించిన ఫిలిప్ సాల్ట్... ఒక ఫోర్, రెండు సిక్స్ లు కొట్టాడు. ఇదే సమయంలో యశ్ దయాల్ వేసిన రెండో ఓవర్ లో 14 పరుగులు రాబట్టింది.

ఇదే క్రమంలో మూడో ఓవర్ లోనూ 14 పరుగులు రాబట్టుకుంది. ఇలా... నాలుగో ఓవర్ లో 7, ఐదో ఓవర్ లో 11, ఆరో ఓవర్లో ఏకంగా 21 పరుగులు రాబట్టడంతో... పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 85 పరుగులు చేసింది కోల్ కతా.

తొలి వికెట్ కోల్పోయిన కోల్ కతా:

దూకుడు మీదున్న కోల్ కతా కు మయాంక్ బ్రేక్ వేశాడు. ఇందులో భాగంగా అతడు వేసిన ఏడో ఓవర్ మూడో బంతికి నరైన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి నరైన్ వ్యక్తిగత స్కోరు 47 (22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్ లు) పరుగులు కాగా... కోల్ కతా స్కోరు 7 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 89 పరుగులకు చేరింది.

గ్రీన్ అద్భుతమైన క్యాచ్.. రెండో వికెట్ డౌన్:

విజయ్ కుమార్ వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి ఫిలిప్ సాల్ట్ భారీ షాట్ కు ప్రయత్నించి గ్రీన్ చేతికి చిక్కాడు. ఈ సమయంలో సాల్ట్ వ్యక్తిగత స్కోరు 30 (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులు.

కోల్ కతా విజయానికి 54 బంతుల్లో 51 పరుగులు:

అల్జారీ జోసెఫ్ వేసిన 11 ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ దుమ్ములేపాడు! ఇందులో భాగంగా... వరుసగా 6, 4, 0, 6, 4 బాదాడు! దీంతో ఈ ఓవర్ లో 20 పరుగులు వచ్చాయి. ఫలితంగా కోల్ కతా విజయానికి ఇంకా 9 ఓవర్లలో 51 పరుగులు కావాలి.

వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ & ఔట్!

క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచీ భారీ షాట్ లతో చెలరేగిన వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో భాగంగా 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే... తర్వాత ఓవర్ ఫస్ట్ బంతికే కొహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

కోల్‌ కతా చేతిలో బెంగళూరు చిత్తు:

ఈ క్రమంలో 16.5 ఓవర్లకు కోల్ కతా లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ 39 (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు) విన్నింగ్ షాట్ ఆడాడు! దీంతో... కోల్ కతా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా... 1.04 నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్ లో నిలిచింది.