Begin typing your search above and press return to search.

కొహ్లీ హాఫ్ సెంచరీల సెంచరీతో ఫ్యాన్ పెళ్లి ముడి!

ఈ ఫ్లకార్డులో... "విరాట్ కోహ్లీ 50వ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటాను" అని రాసి ఉంది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 11:12 AM GMT
కొహ్లీ హాఫ్  సెంచరీల సెంచరీతో ఫ్యాన్  పెళ్లి ముడి!
X

కాస్త స్లోగా స్టార్ట్ అయినట్లు అనిపించినా... రెండు మూడు మ్యాచ్ ల తర్వాత ప్రపంచ కప్ క్రికెట్ లో ఆ స్థాయి సందడి నెలకొంది. ఎన్నో ట్విస్ట్ లు, మెరెన్నో జలక్కులు, పలు రికార్డులతో వరల్డ్ కప్ క్రికెట్ రసకందాయంలో పడింది. ఇందులో భాగంగా తన 2023 ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్ గెలిచిన టీం ఇండియా.. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో రెండో మ్యాచ్ ఆడుతుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌ లో హష్మతుల్లా షాహిది (14*), ఒమర్జాయ్ (6*) ఉన్నారు. భారత్ ఉన్నంతలో కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తుంది. ఆ సంగతి అలా ఉంటే... ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన ఫ్లకార్డు ఒకటి దర్శనమిచ్చింది. ఇది అత్యంత ఆసక్తికరంగా ఉంది.

అవును... తాజాగా జరుగుతున్న ఇండియా – ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఓ ప్లకార్డ్ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. టీం ఇండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ అభిమాని ప్రదర్శనించిన ప్లకార్డ్ అది. ఈ ఫ్లకార్డులో... "విరాట్ కోహ్లీ 50వ వన్డే ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన తరువాతే పెళ్లి చేసుకుంటాను" అని రాసి ఉంది. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది. దీంతో తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

ఈ వరల్డ్ కప్ అవ్వగానే ముహూర్తం పెట్టేసుకోమని ఒకరంటే... అప్పటివరకూ ఆగనవసరం లేదు మరో నాలుగైదు మ్యాచుల అనంతరం డేట్ ఫిక్స్ చేసేసుకోమని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. కారణం...ఈ అభిమాని కోరిక అంత పెద్దదేమీ కాదు. కోహ్లీకి అతి చిన్న కోరిక అనే చెప్పాలి!

ఎందుకంటే... వన్డే ఇంటర్నేషనల్స్‌ లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ చేసిన సెంచరీల సంఖ్య 47. అంటే... 50 సెంచరీల ల్యాండ్ మార్క్‌ ను అందుకోవడానికి అతను ఇంకో మూడు సెంచరీల దూరంలో నిలిచాడన్నమాట. పైగా ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉన్నాడు కోహ్లీ. ఈ వరల్డ్ కప్ లోని తొలిమ్యాచ్ లో ఛేజింగ్ లో ఆస్ట్రేలియాపై 85 పరుగులతో సత్తా చాటాడు. సో... అన్నీ అనుకూలంగా జరిగితే ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసేలోపే ఆ సెంచరీల హాఫ్ సెంచరీ పూర్తయిపోవడం.. ఆ అభిమాని ఒక ఇంటివాడు అయిపోవడం కన్ ఫాం!