Begin typing your search above and press return to search.

కొత్త లిస్ట్ లోకి కింగ్ ఎంట్రీ... విరాట్ పేరున మరో రికార్డ్!

సమయంలో అత్యధిక సెంచరీల సచిన్ 49ని దాటి 50 సెంచరీలు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ సమయంలో టెస్టుల్లో మరో మెట్టు పైకెదిగాడు కొహ్లీ.

By:  Tupaki Desk   |   30 Dec 2023 11:30 PM GMT
కొత్త లిస్ట్  లోకి కింగ్  ఎంట్రీ... విరాట్  పేరున మరో రికార్డ్!
X

టీం ఇండియా పరుగుల రారాజు, కింగ్ కొహ్లీ ఫుల్ ఫాం లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో 11 మ్యాచులు ఆడిన కొహ్లీ 95.62 యావరేజ్ తో 765 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇదే సమయంలో అత్యధిక సెంచరీల సచిన్ 49ని దాటి 50 సెంచరీలు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ సమయంలో టెస్టుల్లో మరో మెట్టు పైకెదిగాడు కొహ్లీ.

అవును... సెంచూరియన్‌ లోని సూపర్‌ స్పోర్ట్‌ మైదానంలో సఫారీలతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇందులో భాగంగా తన తొలి ఇన్నింగ్స్‌ లో 38 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌ లో 76 పరుగులు చేశాడు. ఈ 114 పరుగులతో భారత్ తరపున టెస్టు క్రికెట్‌ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్స్ జాబితాలో కోహ్లీ టాప్ 4 లో స్థానం సంపాదించుకున్నాడు!

భారత్ తరుపున టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఉన్న సంగతి తెలిసిందే. సచిన్ 329 ఇన్నింగ్స్‌ ల్లో మొత్తం 15,921 పరుగులు చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఇక సచిన్ తర్వాత స్థానంలో మిస్టర్ డిపెండబుల్, ది వాల్ రాహుల్ ద్రావిడ్ ఉన్నారు.

ప్రస్తుతం టీం ఇండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్... 284 టెస్టు ఇన్నింగ్స్‌ లు ఆడి 13,265 పరుగులు చేసి 2వ ర్యాంక్‌ లో ఉన్నాడు. ఇక మూడోస్థానంలో సునీల్ గవాస్కర్ కొనసాగుతున్నారు. గవాస్కర్ 214 టెస్టు ఇన్నింగ్స్‌ లలో మొత్తం 10,122 పరుగులు చేశాడు. ఇక మొన్నటివరకూ నాలుగోస్థానంలో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ ను వెనక్కి నెట్టిన కొహ్లీ నాలుగో స్థానంలో తనకు చోటు దక్కించుకున్నాడు.

225 టెస్ట్ ఇన్నింగ్స్‌ ఆడిన వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్... మొత్తం 8781 పరుగులు సాధించారు. దీంతో ప్రస్తుతం ఈ జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక తాజాగా నాలుగో స్థానానికి ఎంట్రీ ఇచ్చిన కొహ్లీ... 189 ఇన్నింగ్స్‌ ల్లో మొత్తం 8,790 పరుగులు చేశాడు.

ఇలా టీం ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన జాబితా ఉంటే... టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ వ్యాప్తంగా బ్యాటర్స్ లిస్ట్ ఒక సారి చూద్దాం.

ఇందులో కూడా 15921 పరుగులతో సచిన్ టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా... రెండో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 287 ఇన్నింగ్స్ ల్లో 13,378 పరుగులు చేశాడు. ఇక 13289 పరుగులతో దక్షిణాఫ్రికా బ్యాటర్ కలీస్, 13288 పరుగులతో ది వాల్ ద్రావిడ్, 12472 పరుగులతో ఇంగ్లాండ్ బ్యాటర్ అలిస్టర్ కుక్ లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.