Begin typing your search above and press return to search.

తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీసిన కోహ్లీ.. సర్ ప్రైజ్ ఏమంటే?

ఈ వికెట్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కోహ్లీ పడగొట్టిన వికెట్ ఆషామాషీ కాదు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:29 AM GMT
తొమ్మిదేళ్ల తర్వాత వికెట్ తీసిన కోహ్లీ.. సర్ ప్రైజ్ ఏమంటే?
X

అవును.. విరాట్ కోహ్లీ బంతితో మేజిక్ చేశాడు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన చేతికి వచ్చిన బంతితో బౌలింగ్ వేసి.. వికెట్ తీసుకున్నాడు. తాజాగా జరిగిన నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఈ వికెట్ హైలెట్ కావటమే కాదు.. అందరిని ఆనందానికి గురి చేసింది. వికెట్ తీసిన కోహ్లీ సైతం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సెంచరీ కొట్టినప్పుడు కూడా ఇంతలా సంతోషపడలేదేమో? అంతలా ఆనందానికి గురయ్యాడు.

ఈ వికెట్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కోహ్లీ పడగొట్టిన వికెట్ ఆషామాషీ కాదు. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు కెప్టెన్ స్టాట్ ఎడ్వర్డ్స్ వికెట్ ను బలి తీసుకున్నాడు. తద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టారు. కోహ్లీ వేసిన బంతిని స్టాట్ బ్యాట్ కు పని చెప్పగా.. అది గాల్లోకి లేవటం.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ లెగ్ సైడ్ లో అద్భుత రీతిలో క్యాచ్ పట్టటంతో చాలా కాలం తర్వాత కోహ్లీకి వికెట్ దక్కింది.

వాస్తవానికి ఈ వికెట్ కుముందే మరో వికెట్ చేతికి అందాల్సింది. ఆ బౌల్ వేసినప్పుడు స్లిప్ లో ఫీల్డర్ లేకపోవటంతో క్యాచ్ మిస్ అయ్యింది. తాజాగా సాధించిన వికెట్.. కోహ్లీ కెరీర్ లో ఐదో వికెట్ కావటం గమనార్హం. గతంలో తన బంతితో నాలుగు వికెట్లు తీశారు. తన వన్డే కెరీర్ లో కోహ్లీ బౌలింగ్ లో ఔట్ అయిన వారిలో అలిస్టర్ కుక్.. కీస్వెట్టర్.. డికాక్.. మెక్ కల్లమ్ లు ఉన్నారు. టీ20ల్లో విరాట్ నాలుగు వికెట్లు.. ఐపీఎల్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

కోహ్లీ సాధించిన వికెట్ కు స్టాండ్స్ లో ఉన్న ఆయన సతీమణి అనుష్క శర్మ తీవ్ర ఆనందానికి గురయ్యారు. ఆమె స్పందించిన తీరు.. టీవీల్లో చూసిన వారంతా మరింత ఆనందానికి గురయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 410 పరుగుల భారీ స్కోర్ ను నెదర్లాండ్స్ ముందుంచింది. 411 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన ఆ జట్టు 47.5 ఓవర్లలో250 పరుగులకు ఆలౌటైంది.