అతడు ప్రేమించింది నటిని కాదా?
టీ-20 వరల్డ్ కప్ తో మరోసారి ఇండియా విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2024 5:54 AM GMTటీ-20 వరల్డ్ కప్ తో మరోసారి ఇండియా విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కప్ గెలిచి ముంబైలో అడుగు పెట్టిన టీమ్ ఇండియాకి ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం లభించింది. అక్కడ నుంచి ర్యాలీ ఎంతో దిగ్విజయంగా సాగింది. ఈ వరల్డ్ కప్ లో కులదీప్ కూడా భాగమైన సంగతి తెలిసిందే. తాజాగా సొంతగడ్డ కాన్పూర్ లో కులదీప్ ని గ్రాండ్ గా స్వాగతించారు. కులదీప్ రాక చూసి అభిమానులంతా డీజేలు పెట్టి టపాసులు కాల్చి పండగ చేసుకున్నారు.
అయితే ఇదే సమయంలో కులదీప్ పెళ్లి గురించి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అతి త్వరలోనే వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే కులదీప్ ఓ బాలీవుడ్ భామతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. ఆమెనే వివాహం చేసుకుంటాడని ప్రచారం సాగింది. అయితే ఆ ప్రచారాన్ని కులదీప్ కండించాడు. ఏ బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో పడలేదని, డేటింగ్ చేయలేదని తెలిపాడు.
తాను పెళ్లి చేసుకునే అమ్మాయి సినిమా రంగానికి చెందింది కాదని అన్నాడు. తనని , తన కుటుంబాన్ని బాగా చూసుకునే అమ్మాయి అయితే చాలని, అంతకు మించి పెద్ద కోర్కెలేవి లేవన్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానన్నాడు. దీంతో కులదీప్ చేసుకునే అమ్మాయి నటి కాదని తేలిపోయింది. అయితే కులదీప్ చేసుకునే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
అమ్మాయిని చూసుకునే ఈ వ్యాఖ్యలు చేసాడని నెటి జనులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లకు..ఇండియా ప్లేయర్లకు మధ్య ప్రేమ పాఠాలు తరుచూ తెరపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే కులదీప్ కూడా ఏ నటినో ప్రేమించి ఉంటాడని భావించారు. కానీ తాను ప్రేమించింది ఇండస్ట్రీ బయట అమ్మాయిని తాజాగా క్లారిటీ వస్తోంది.