Begin typing your search above and press return to search.

10 రోజుల్లో 8 మ్యాచ్ లు.. అమెరికా పిచ్ లు పిచ్చెక్కిస్తున్నాయ్

టి20 క్రికెట్ అంటేనే భారీ షాట్లు.. ధనాధన్ ఇన్నింగ్స్ లు.. తక్కువ స్కోర్లు నమోదైతే కనీసం సగటు ప్రేక్షకుడు కూడా మ్యాచ్ చూడడు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 11:53 AM GMT
10 రోజుల్లో 8 మ్యాచ్ లు.. అమెరికా పిచ్ లు పిచ్చెక్కిస్తున్నాయ్
X

టి20 క్రికెట్ అంటేనే భారీ షాట్లు.. ధనాధన్ ఇన్నింగ్స్ లు.. తక్కువ స్కోర్లు నమోదైతే కనీసం సగటు ప్రేక్షకుడు కూడా మ్యాచ్ చూడడు. అందులోనూ అమెరికా-కరీబియన్ దీవులు ఆతిథ్యం ఇస్తున్న టి20 ప్రపంచ కప్ లో మ్యాచ్ లు (భారత్ ఆడేవి) రాత్రి 8 గంటలకు మొదలువుతున్నాయి. అంటే.. ప్రేక్షకుల్లో దీంతోనే కొంత ఆదరణ తగ్గిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇంతలోనే పిచ్ లను చూస్తుంటే ఇదేం మ్యాచ్ రా నాయనా? దీనికోసం అర్ధరాత్రి వరకు వేచి చూడాలా? అన్న వాదన వస్తోంది.

మజా ఇవ్వని డ్రాప్ ఇన్ పిచ్ లు

బంతికి, బ్యాటుకి మధ్య సమతూకం కోసం సిస్‌గ్రాస్‌ సంస్థ హైబ్రిడ్‌ పిచ్‌ (డరాప్ ఇన్ )లు రూపొందించింది. ఈ ట్రాక్‌లలో సహజసిద్ధమైన గడ్డితో పాటు 5 శాతం పాలిమర్‌ ఉంటుంది. బౌలర్లు స్థిరమైన బౌన్స్‌ రాబట్టొచ్చు. పిచ్‌ చాలాసేపు తాజాగా ఉంటుంది. దీంతో బౌలర్లు కూడా సమర్థవంతంగా బంతులు వేయగలుగుతారు. డ్రాప్ ఇన్ పిచ్ లపై మొదట ఉన్న అభిప్రాయం ఇది. కానీ, అసలు సిసలు మజాను అందించలేకపోతున్నాయి. వచ్చే 10 రోజుల్లో 8 మ్యాచ్ లు జరగున్న నేపథ్యంలో వరల్డ్ కప్ మజా ఇస్తుందా? లేదా? అన్న సందేహం కలుగుతోంది.

అమెరికా న్యూయార్క్ లోని నాసౌ కౌంటీ స్టేడియంలో టి20 మ్యాచ్ లు ఆకట్టుకోవడం లేదు. ప్రమాదకరమైన బౌన్స్ తో ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు జరగ్గా ఏ జట్టూ 100 పరుగులు దాటలేదు. ఈ పిచ్ లు టి20లకు తగవు అని స్వయంగా ఐసీసీనే ఒప్పుకోవడం గమనార్హం.

ఆస్ట్రేలియా నుంచి తెప్పించి..

న్యూయార్క్ కు డ్రాప్ ఇన్ పిచ్ లను ఐసీసీ ఆస్ట్రేలియా నుంచి తెప్పించింది. వీటిని మెయిన్ స్టేడియానికి నాలుగు, దగ్గర్లోని ప్రాక్టీస్ కోసం ఆరు కేటాయించింది. డిసెంబరు-మార్చి మధ్య న్యూయార్క్ లో తీవ్రమైన చలి. దీంతోనే ఆస్ట్రేలియాలో తయారు చేశారు. నిరుడు డిసెంబరులో ఫ్లోరిడాకు తీసుకొచ్చారు. ఏప్రిల్ లో న్యూయార్క్ చేరాయి. మే మొదట్లో వీటిని స్టేడియాలకు తీసుకొచ్చారు.

అయితే, డ్రాప్ ఇన్ పిచ్ ల ప్రయోగం విఫలమైందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. మున్ముందు ఎలా జరుగుతుందో చూద్దాం.