Begin typing your search above and press return to search.

"టూ హాట్"... సెక్సీగా ఉందని ఒలింపిక్స్ నుంచి పంపించేశారు!

ఇక ఇలా అందంగా ఉండేవారికి స్కూల్ ఏజ్ నుంచి ఫాలోయింగ్ మొదలవుతుంటుది.. ఎంతమందిలో ఉన్నా వీళ్లు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా ఉంటారు

By:  Tupaki Desk   |   9 Aug 2024 9:30 AM GMT
టూ హాట్... సెక్సీగా ఉందని ఒలింపిక్స్ నుంచి పంపించేశారు!
X

అందంగా ఉండటం చాలా అదృష్టంగా భావిస్తుంటారు చాలామంది మహిళలు. పైగా అందంగా ఉండటం తమ ఆత్మవిశ్వాసం పెరగడంలో కీలక భూమిక పోషిస్తుందని నమ్ముతుంటారు. ఇక ఇలా అందంగా ఉండేవారికి స్కూల్ ఏజ్ నుంచి ఫాలోయింగ్ మొదలవుతుంటుది.. ఎంతమందిలో ఉన్నా వీళ్లు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా ఉంటారు. ఇక అంత అందం ఉన్న సెలబ్రెటీల సంగతైతే చెప్పేపనే లేదు.

వాళ్లు కనిపించారంటే మగాళ్ల కళ్లే కాదు, కెమెరాల చూపు కూడా అటువైపే ఉంటుంది. ఈ విషయంలో రంగంతో సంబంధం లేదనే చెప్పాలి. ఈ విషయానికి ఏ రంగం అతీతం కాదనే అనుకోవాలి. అయితే ఒక్కోసారి వారి అందమే వారికి శాపంగా మారుతుంటుంది. ఇంత అందం తనకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదని భావించే కొంతమంది ఉన్మాదులు వారి అందాన్ని నాశనం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు.

ఈ క్రమంలో తాజాగా పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఓ క్రీడాకారినికి తన అందమే శాపమైంది. చాలా అందంగా ఉండటం కారణంగా ఆమె ఒలింపిక్స్ నుంచి తిరిగి దేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ చర్యను అత్యంత అవమానంగా భావించిన ఆమె... ఏకంగా క్రీడకే గుడ్ బై చెప్పింది.. ఇకపై తన దేశం కోసం ఆడేది లేదని కుండబద్దలు కొట్టింది. ప్రస్తుతం ఈ విషయం అత్యంత చర్చనీయాంశంగా మారింది!

అవును... పరాగ్వేకి చెందిన లువానా ఆలాన్సో అనే 20 ఏళ్ల స్విమ్మర్ పారిస్ ఒలింపిక్స్ లో తన దేశం తరుపున పాల్గొనడానికి వచ్చింది. గతంలో టోక్యో ఒలింపిక్స్ లోనూ ఆమె పాల్గొంది. వీటితో పాటు బటర్ ఫ్లై ఈవెంట్లలో అనేక రికార్డులు కలిగి ఉంది. ఈసారి పారిస్ లో ఎలాగైనా ఒలింపిక్స్ లో పతకం సాధించాలనే గట్టి పట్టుదలతో ఎంటరైంది. 100 మీటర్ల బటర్ ఫ్లై కేటగిరిలో క్వార్టర్ ఫైనల్స్ కూడా గెలిచింది.

ఇక తన తోటి పరాగ్వే అథ్లెట్లతోనే కలిసి ఒలింపిక్ విలేజ్ లోనే ఉంటుంది. ఈ సమయంలో... లువానా అలాన్సో అందం కారణంగా పోటీలపై దృష్టి సారించలేకపోతున్నామని.. ఆమె తన అందంతో చాలా డిస్ట్రబ్ చేస్తోందని.. ఫలితంగా తమ ఏకాగ్రత దెబ్బతింటుందని.. ఆమె కూడా తమ ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తోందని.. వారంతా తమ మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేశారు.

అయితే దురదృష్టవసాత్తు... పరాగ్వే జట్టు మేనేజ్మెంట్ కూడా ఆ మగ అథ్లెట్ల మాటే విన్నది! దీంతో తమదేశంలోని ఉన్నతాధికారులకు ఈ సమాచారం చేరవేసింది మేనేజ్మెంట్. అంతే... లువానా అందం అక్కడున్న మగ అథ్లెట్లకు ఇబ్బందికరంగా మారిందనే ఆరోపణకు బలం చేకూరింది. వెంటనే ఆమెను స్వదేశానికి వచ్చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో... ఆమె తట్టా బుట్టా సర్ధుకుని తిరిగి దేశానికి ప్రయాణమై వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఇప్పటికే సెమీస్ కి చేరిన ఆమె కచ్చితంగా ఈ ఒలింపిక్స్ లో పతకం సాధిస్తుందని అంతా భావించారు! అయితే ఈ ఘోర అవమానంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది. ప్రస్తుతం 20 ఏళ్ల వయసులో మాత్రమే ఉన్న లువానా ఇంకా ఎంతో కెరీర్ ఉన్నప్పటికీ తోటి మగ అథ్లెట్ల కారణంగా స్విమ్మింగ్ కి గుడ్ బై చెప్పింది. ఇకపై దేశం తరుపున స్విమ్మింగ్ చేయనని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా తన ఆవేదనను వెల్లడించింది.

ఇందులో భాగంగా... తన సొంత దేశ ఆటగాళ్లే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తనపై తప్పుడు పుకార్లు సృష్టించారని ఆవేదన చెందింది. పాశాత్య మీడియా సైతం "టూ హాట్" అంటూ తన అందన్ని వర్ణిస్తూ రాతలు రాయడం ఏమిటని ప్రశ్నించింది. ఇది సరైన చర్య కాదంటూ మండి పడింది. ఏది ఏమైనా... ఫైనల్ గా ఆమె అందమే ఆమెకు శాపమైంది!! ఇది ఎంతో విచారకరమంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు!