బెంగళూరు వర్సెస్ లక్నో... హేడ్ టు హెడ్ గణాంకాలివే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 లో భాగంగా 15వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
By: Tupaki Desk | 2 April 2024 4:20 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 లో భాగంగా 15వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఏప్రిల్ 2 (మంగళవారం) జరగనున్న ఈ మ్యాచ్ కోసం బెంగళూరులోని చినస్వామి స్టేడియం సిద్ధమైంది. వాస్తవానికి ఇక్కడ అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ లకు ప్రసిద్ధి అయినప్పటికీ ఈ సీజన్ ఐపీఎల్ లో ఇంకా బ్యాటర్ లకు అంతగా కలిసివస్తున్నట్లు లేదు! అయితే... బెంగళూరు వర్సెస్ లక్నో మ్యాచ్ లో ఆ భారీ స్కోర్ మ్యాచ్ బోర్డుపై కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.
అవును... ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో నంబర్ 2 జట్టుగా ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ ఓఈటమి నుంచి తిరిగి పుంజుకోవాలని చూడటం.. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్.. తమ చివరి మ్యచ్ లో పంజాబ్ కింగ్స్ పై 21 పరుగుల తేడాతో గెలిచిన ఉత్సాహాన్ని కంటీన్యూ చేయాలని చూస్తున్న తరుణంలో... ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.
ఇందులో ప్రధానంగా ఆర్సీబీ విషయానికొస్తే... ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైపోయింది. దీంతో.. ఈ మ్యాచ్ లో గెలిచి కాస్త పైకి ఎగబాకాలని భావిస్తుంది. ఈ టీం లో ఇప్పటివరకూ విరాట్ కొహ్లీ మాత్రమే అనూహ్యంగా రాణిస్తున్నా పరిస్థితి. మ్యాక్స్ వెల్, కామెరాన్ గ్రీ లు గత మ్యాచ్ తో కాస్త ఫాంలోకి వచ్చినట్లు కనిపిస్తున్నా.. వారి లెవెల్ ఇన్నింగ్స్ మాత్రం ఇంకా ఆవిష్కృతం కాలేదు.
మరోపక్క దినేష్ కార్తీక్ మాత్రం తనకున్న ఫినిషర్ పేరును సార్ధకం చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో... గత మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్లు సిరాజ్, జోసెఫ్ లు 15 కంటే ఎక్కువ ఎకానమీని కలిగి ఉండగా.. ఇంపాక్ట్ ప్లేయర్ విజయ కుమార్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ ఈ మ్యాచ్ లో అయినా తన లెవెల్ లో రాణిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక లక్నో విషయానికొస్తే... గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ని ఓడించిన ఉత్సాహంలో ఉంది. దీంతో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఒకటి గెలవడంతో.. పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో డీకాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ చేయగా.. స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ మ్యాచ్ స్టార్ గా నిలిచాడు. గంటకు 150 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో డెలివరీలు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు.
హెడ్ టు హెడ్ గణాంకాలు:
ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటివరకూ 4 సార్లు తలపడ్డాయి. వీటిలో మెరుగైన ట్రాక్ రికార్డ్ ఆర్సీబీ కలిగి ఉంది. ఇందులో భాగంగా... ఆడిన 4 మ్యాచ్ లలోనూ 3 మ్యాచ్ ల్లో ఆర్సీబీ విక్టరీ సాధించగా... ఒక మ్యాచ్ లో లక్నో గెలిచింది.
ఇక లక్నోపై బెంగళూరు అత్యధిక స్కోరు 212 కాగా.. బెంగళూరుపై లక్నో అత్యధిక స్కోరు 213 పరుగులు. దీతో... ఈసారి కూడా 200 మార్కు కు అవకాశం ఉండొచ్చని అంటున్నారు!
పిచ్ రిపోర్ట్:
బ్యాటర్లకు స్వర్గదామంగా చెప్పే చినస్వామి స్టేడియంలో పిచ్ పేసర్ లకు తక్కువ స్వింగ్ అందిస్తుందని.. స్పిన్నర్లు కూడా ఎక్కువ టర్న్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ఇక్కడ ఛేజింగ్ జట్టు సాధారణంగా డ్యూ ఫ్యాక్టర్ కారణంగా ప్రయోజనంతో ముగుస్తుందని అంటున్నారు.