ఆ డ‘బుల్లెట్..’ రూ.కోటి.. మను బాకర్ పిస్టల్ రేటుపై వాస్తవమేంటి?
డౌట్ లేకుండా చెప్పాలంటే అన్ని రకాల స్పోర్ట్స్ లో షూటింగ్ అత్యంత ఖరీదైనది.
By: Tupaki Desk | 26 Sep 2024 12:30 PM GMTడౌట్ లేకుండా చెప్పాలంటే అన్ని రకాల స్పోర్ట్స్ లో షూటింగ్ అత్యంత ఖరీదైనది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించడంతో షూటింగ్ గురించి భారత దేశంలో తీవ్రమైన చర్చ మొదలైంది. బింద్రా 112 ఏళ్ల ఒలింపిక్స్ చరిత్రలో మొట్టమొదటిసారిగా భారత దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. అప్పుడే షూటింగ్ అంటే ఏమిటి? బింద్రా వాడిని పిస్టల్ ఖరీదు ఎంత? అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. తాజాగా
పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు తెచ్చింది మను బాకర్. దీంతో మళ్లీ 16 ఏళ్ల తర్వాత షూటింగ్ సెన్సేషన్ అయింది.
తొలి అథ్లెట్ గా రికార్డు
సంఖ్య తక్కువే కానీ.. ఇప్పటివరకు భారత్ కు ఒలింపిక్స్ లో అనేక పతకాలు వచ్చాయి. అయితే, ఒకే అథ్లెట్ ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెలిచిన సందర్భం ఎప్పుడూ లేదు. కానీ, మను బాకర్ ఆ ఘనత సాధించింది. అసలు పారిస్ లో భారత్ కు వచ్చిన పతకాలే తక్కువ. అందులో రెండు మనునే సాధించడంతో ఆమె గురించి సెర్చింగ్ బాగా పెరిగింది. ఇది చివరకు సోషల్ మీడియాలోనూ మను ట్రెండింగ్ లో నిలిచింది. అయితే, ఎక్కువగా వెదికింది ఆమె ఒలింపిక్స్ లో రెండు పతకాలు కొల్లగొట్టిన పిస్టల్ గురించే. సోషల్ మీడియాలో మరో విధంగా కామెంట్లు కూడా వస్తున్నాయి.
పతకాతు తీసుకెళ్లడం అవసరమా?
మను డౌట్ లేకుండా ప్రొఫెషనల్ అథ్లెట్. ఆమె సాధించిన ఘనత కూడా తక్కువేమీ కాదు. అయితే, ఆమె ఎక్కడికెళ్లినా పతకాలను తీసుకెళ్తుండడం కాస్త విమర్శలకు తావిస్తోంది. వీటిని మను గట్టిగా తిప్పికొట్టింది. దీంతో టాపిక్ ఒలింపిక్స్ లో ఆమె వాడిన పిస్టల్ ధర మీదకు మళ్లింది. అంతే.. చర్చ కాస్త రచ్చగా మారింది. మను పిస్టల్ ఖరీదు రూ.కోటి దాకా ఉంటుందని అంటుండగా.. ఇంకా ఎక్కువని మరికొందరు మొదలుపెట్టారు. అయితే, ఈ ఊహాగానాలపై మను బాకర్ స్పష్టత ఇచ్చింది.
రూ.కోటి కాదు కానీ..
ఒలింపిక్స్ లో రెండు పతకాలు తెచ్చిన తన పిస్టల్ ధరపై మను చెప్పుకొస్తూ.. దాని ధర రూ.కోటి ఉండదు అని తెలిపింది. ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘అమ్మో పిస్టల్ రూ.కోటినా? అంత ఊహించుకోవాల్సింది లేదు. అది రూ.లక్షన్నర నుంచి రూ.1.85 లక్షలు ఉండొచ్చు. మొత్తం డబ్బులు ఒకేసారి పెట్టి కొన్నా. అందుకే రేటులో కొంచెం అటుఇటూ తేడాగా ఉంటుంది. మోడల్ ప్రకారం కూడా రేటు మారుతుంది. కొత్తదైతే ఒక రేటు, సెకండ్ హ్యాండ్ అయితే మరో రేటు పడుతుంది. స్పోర్ట్స్ లో మనం ఓ రేంజ్ కు చేరాక కంపెనీలే వచ్చి పిస్టళ్లను ఉచితంగా ఇస్తాయని’’ తెలిపింది. కాగా, షూటింగ్ కాకుండా ఇంకేం ఇష్టపడతావని గతంలో మనును ఎవరో అడిగారు. కోసం వస్తే ఏం చేస్తావని అడిగారు. ‘‘షూటింగ్ అంటే నాకు బాగా ఇష్టం. అదే జీవితం. వీలైనంత సమయం షూటింగ్ చేస్తూనే ఉంటా. దేశం కోసం పతకాలు సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. ఇతర పనులు చేయడానికి సిద్ధమైనప్పటికీ.. షూటింగ్ కే నా టాప్ ప్రయారిటీ. నాకూ కోపం వస్తుంది. అది అప్పుడప్పుడే. దాన్నుంచి కూడా పాజిటివ్ అంశాలు నేర్చుకునేందుకు చూస్తా. క్రీడాకారిణిగా ఇది చాలా ముఖ్యం’ అని మను వివరించింది.