Begin typing your search above and press return to search.

సిక్స్‌ అండ్‌ ఔట్‌... తప్పతాగి స్పృహ తప్పిన మ్యాక్స్ వెల్!

వివరాళ్లోకి వెళ్తే... ఆడి లైడ్ లో "సిక్స్‌ అండ్‌ ఔట్‌" అనే బ్యాండ్‌ నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్ కి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ హాజరయ్యాడు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 6:15 AM GMT
సిక్స్‌  అండ్‌  ఔట్‌... తప్పతాగి స్పృహ తప్పిన మ్యాక్స్  వెల్!
X

ఏ-త్రీ సైజు తెల్లని కాగితంపై చిన్న నల్ల సిరా చుక్కపడిందనుకోవాలో.. లేక, ఎంత పెద్ద బెలూన్ అయినా చిన్న గుండు సూదికి లోకువ అని భావించాలో తెలియదు కానీ... స్టార్ క్రికెటర్, ఇటీవల జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్ కప్ లో ఆసిస్ విశ్వవిజేత అవ్వడంలో కీలక భూమిక పోషించిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక్కసారిగా నెగిటివ్ సౌండ్ తో వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆసిస్ మీడియా, క్రికెట్ ఆస్ట్రేలియా, తోటి ఆటగాళ్లు సైతం అతడిని తప్పుపడుతున్న పరిస్థితి నెలకొంది!

అవును.. శృతిమించిన యవ్వారాలు ఏ విషయంలో అయినా చేటే! ఇక మద్యం తాగే విషయంలో ఇది మరింత చేటు! ఒక స్టేజ్ వరకూ అది తాగేవారి కంట్రోల్ లో ఉన్నప్పటికీ... మ్యాజిక్ పాయింట్ దాటిపోతే ఎంత గొప్ప మనిషైనా దాని కంట్రోల్ లోకి వెళ్లిపోతారు! తర్వాత ఏమి జరుతుందనేది మందు మాలచ్చిమికి తప్ప మానవ మాత్రుడికి తెలియదు! ప్రస్తుతం ఆసిస్ స్టార్ క్రికెటర్ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... ఆడి లైడ్ లో "సిక్స్‌ అండ్‌ ఔట్‌" అనే బ్యాండ్‌ నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్ కి ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ హాజరయ్యాడు. ఈ క్రమంలో... అక్కడే చాలాసేపు గడిపాడు. ఈ సమయంలో... అభిమానులకు ఆటోగ్రాఫ్‌ లు ఇచ్చాడు.. వారితో ఫొటోలు దిగుతూ సరదాగా గడిపాడు. ఈ సమయంలో స్నేహితులతో కలిసి "చీర్స్" చెప్పాడు! అయితే... అది నాన్ స్టాప్ గా సాగిందని తెలుస్తుంది.

ఇలా స్నేహితులతో కలిసి శృతిమించి మద్యం సేవించిన మ్యక్స్ వెల్ సృహకోల్పోయినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో అతడి స్నేహితులు లేపడానికి ఎంత ప్రయత్నించినా మ్యాక్సీ స్పందించలేదు. దీంతో... హుటాహుటున అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో సృహలోకి వచ్చిన మ్యాక్సీ... చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో విషయం తెలుసుకున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది.

ఇదే సమయంలో ఈ విషయంపై కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ కాస్త ఘాటుగానే స్పందించారు! ఇందులో భాగంగా... తాను కూడా ఆ మ్యూజిక్ ఫెస్ట్ లో పాల్గొన్నట్లు చెప్పిన కమిన్స్... తానూ ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపాడు. అన్నీ తెలిసిన వాళ్లం అయిన మనం తీసుకునే నిర్ణయాలకు మనమే బాధ్యులం అని అంటూ... ఈ విషయంపై మ్యాక్సీనే సమాధానం చెప్పాలని సూచించాడు.

ఇదే క్రమంలో స్పందించిన మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్... ఇలాంటి సంఘటనలు సముచితం కాదని.. పరిస్థితి అంబులెన్స్ ఎక్కేవరకూ వచ్చిందంటే ఆందోళన కరంగా ఉందని.. చుట్టూ కెమెరాలు, జనం ఉన్న ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా లోతుగా విచారించాలని అన్నాడు. దీంతో... ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందనేది ఆసక్తిగా మారింది.