Begin typing your search above and press return to search.

ట్రోల‌ర్ల‌పై గ్లెన్ మాక్స్‌వెల్ భార్య కౌంట‌ర్

ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా ప‌ర‌మైంది. కంగారూల‌ చేతిలో భారత్ ప‌రాజ‌యం భార‌తీయ‌ అభిమానులను కలవరపెట్టింది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 5:07 AM GMT
ట్రోల‌ర్ల‌పై గ్లెన్ మాక్స్‌వెల్ భార్య కౌంట‌ర్
X

ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా ప‌ర‌మైంది. కంగారూల‌ చేతిలో భారత్ ప‌రాజ‌యం భార‌తీయ‌ అభిమానులను కలవరపెట్టింది. టోర్నీ ఆద్యంతం ఎంతో గొప్పగా ఆడిన టీమిండియాని ఫైన‌ల్ లో దుర‌దృష్టం వెంటాడింది. దీంతో ఆస్ట్రేలియాపై రెండోసారి ఫైన‌ల్‌లో ప‌రాజ‌యం పాలైన టీమ్ గా ఇండియా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. కార‌ణం ఏదైనా ఈ ప‌రాజ‌యాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. వారిలో కొందరు నిరాశ కారణంగా నియంత్రణ కోల్పోయారు. సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్స్ ఇతరులను ట్రోల్ చేస్తూ వాగ్వాదానికి దిగ‌డం క‌నిపించింది. ఆస్ట్రేలియా విజయాన్ని సంబరాలు చేసుకున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ భార్య వినీ రామన్‌ను భారత క్రికెట్ అభిమానులు ట్రోల్ చేశారు. అయితే త‌న‌ను ట్రోల్ చేసిన వారికి వినీ త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ వేసారు. ప్రపంచ కప్ 2023 జర్నీని పిక్చర్ స్లైడ్‌లు క్యాప్షన్‌తో గుర్తుచేసుకుంటూ, విని ట్రోల్‌లను చూసి చిల్ అవ్వండి అంటూ వ్యాఖ్యానించారు.

``మెల్‌బోర్న్ - సింగపూర్ - ఢిల్లీ - ధర్మశాల - అహ్మదాబాద్ - ముంబై - పూణే - కోల్‌కతా - అహ్మదాబాద్ - సింగపూర్ - మెల్‌బోర్న్ లోగాన్‌కి గుర్తుకు రాని ఒక జీవిత ప్రయాణం`` అని వినీ వ్యాఖ్యానించారు. మ్యాక్స్ వెల్ (మ్యాక్సీ ముద్దు పేరు) ఇప్పటికీ మీరు ఈ టోర్నమెంట్‌ని సాధించిన ప్రతిదానికీ విస్మయం వ్యక్తం చేస్తున్నా (మీరు నిజమేనా?) అంటూ ల‌వ్ ఆశ్చ‌ర్యార్థ‌క‌ ఈమోజీల‌ను షేర్ చేసింది. PS కొద్దిగా PSA కోసం చివరి స్లయిడ్‌కు స్వైప్ చేయండి అంటూ #మ్యాక్స్ వెల్ అంటూ ట్యాగ్ ని షేర్ చేసారు.

నిజానికి వినీ రామ‌న్ భార‌తీయురాలు. భార‌త‌దేశంలో పుట్టి పెరిగి, ఆస్ట్రేలియ‌న్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అందుకే పుట్టిన దేశానికి, అత్తిల్లు ఉన్న దేశానికి కూడా వినీ రామ‌న్ మ‌ద్ధ‌తునివ్వాలి. పుట్టిన దేశానికి ముఖ్యంగా తన భర్త, తన పిల్లల తండ్రి ఆడే జట్టుకు కూడా మద్దతు ఇవ్వగలదు.

వినీ చివరి స్లైడ్‌లో రాసిన విష‌యాలు ఇలా ఉన్నాయి. ``క్లాస్సిగా ఉండండి... ఇలా చెప్పాలంటే నమ్మలేము కానీ మీరు భారతీయులుగా ఉంటారు. మీరు పెరిగిన, మీ పుట్టిన దేశానికి మద్దతు ఇవ్వగలరు. మరీ ముఖ్యంగా #నో బ్రెయినర్‌లో మీ భర్త+ మీ పిల్లల తండ్రి ఆడే జట్టుకు మద్దతు ఇవ్వగలరు.. ప్రశాంతంగా ఉండండి పిల్ చేసి, ఆ ఆగ్రహాన్ని ముఖ్యమైన ప్రపంచ సమస్యల వైపు మళ్లించండి..`` అని రాసారు.